Home /News /movies /

SIRIVENNELA SEETHARAMA SASTRY NO MORE MANY CELEBRITIES CONDOLONCE HIS DEATH AND HIS FILM JOURNEY TA

Sirivennela Seetharama Sastry : సినీ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత.. ప్రముఖుల నివాళి..

టాలీవుడ్ లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత (File/Photo)

టాలీవుడ్ లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత (File/Photo)

Sirivennela Seetharama Sastry : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తాజాగా లెజండరీ గేయ రచయత పద్మశ్రీ సీతారామశాస్త్రి కన్నుమూయడం అత్యంత విషాదకరం. గత నెల 24న న్యూమెనియాతో ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ (Krishna Institute Of Medical Scinces)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇంకా చదవండి ...
Sirivennela Seetharama Sastry : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. రీసెంట్‌గా ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన కొన్ని రోజులకే సీతారామశాస్త్రి కన్నుమూయడం అత్యంత విషాదకరం. గత నెల 24న న్యూమెనియాతో ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ (Krishna Institute Of Medical Scinces)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 యేళ్లు.  టాలీవుడ్ లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్తతకు గురయ్యారనే విషయం తెలుసుకున్పప్పటి నుంచి  అభిమానులు అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆయనకు ఏమైంది అంటూ ఆరా తీసారు. అందులోనూ శ్వాసకోస సంబంధిత సమస్యలున్నాయని.. న్యూమోనియాతో హాస్పిటల్ పాలయ్యారని తెలిసి కంగారు పడ్డారు.

సీతారామశాస్త్రి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  వైద్యులు తెలుపుతూ ఉన్నా.. సడెన్‌గా ఆయన తీవ్ర అస్వస్థతకు గురకావడం.. ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లడం ఆయన పాటలను ప్రేమించే కోట్లాది అభిమానులను కలిచివేసిందనే చెప్పాలి. సీతారామశాస్త్రి విషయానికొస్తే.. ఈయన 20 మే 1955న తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లిలో జన్మించారు. మొదట ఈయన టెలిఫోన్ ఎక్సెంజీలో పనిచేశారు. ఆయన

సిరివెన్నెల సీతారామాశాస్త్రి కెరీర్ విషయానికి వస్తే.. సినీ గేయ ర‌చ‌యిత‌గా బాలకృష్ణ హీరోగా కళా తపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనని జన్మభూమి’ సినిమాతో గేయ రచయతగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.  ఆ సినిమా అంతగా  సక్సెస్ కాలేదు ఈ మధ్యకాలంలో . జైలు పక్షి, ఆది దంపతులు, లేడీస్ టైలర్ లాంటి సినిమాలకు కూడా పాటలు రాసారు సీతారామశాస్త్రి. ఆ తర్వాత కే.విశ్వనాథ్ 1986లో తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాకు అన్ని పాటలను సీతారామశాస్త్రి రాశారు. ఈ సినిమాతో చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు. ముఖ్యంగా ఆది భిక్షువు వాడిని ఏది కోరేది.. అంటూ ఆయన రాసిన పాటలు ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చింది.  ప్రేక్షకులకు అభిమానులకు ఆయన అసలు పేరు కంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరుతోనే గుర్తు పెట్టుకున్నారు.  1986లో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు.

అంతేకాదు సినీ గేయ రచయతగా.. ఈయన ‘స్వయంకృషి’, ‘స్వర్ణ కమలం’, సంసారం ఒక చదరంగం’, ‘శృతి లయలు, ఇంద్రుడు చంద్రుడు, నిన్నేపెళ్లాడతా, గాయం, అంతం, అల్లుడు గారు, క్షణ క్షణం, మనీ,సిందూరం, మురారి, ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి రాబోయే ఆర్ఆర్ఆర్ వరకు ఎన్నో సినిమాలో కొన్ని వేల పాటలు ఆయన కలం నుంచి జాలు వారాయి. దాదాపు 165కి పైగా చిత్రాల్లో ఈయన పాటలు రాసారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదిన శాస్త్రిగారు.

ఈయనతో గేయ రచయతగానే కాదు.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాయం’లో నటుడిగా మారారు. ఈ సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని పాటను రాసారు. ఈ సాంగ్‌‌ను దివంగత బాలు గారు ఎంతో హృద్యంగా ఆలపించారు. ఇక ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈయనకు అల్లుడు అవుతారు. ఈ సోదరుడి కూతురుని మాటల మాంత్రికుడు పెళ్లాడారు. మరోవైపు సిరివెన్నెల కుమారుడు రాజా కూడా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఆయన భార్య పద్మావతి మరో కుమారుడు యోగేష్ ఉన్నారు.

తన సినీ గేయాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు నంది అవార్డులు అందుకున్నారు సీతారామశాస్త్రి. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. 37 యేళ్ల సినీ ప్రస్థానంలో 3 వేలకు పైగా పాటలు రచించారు. 2019లో కేంద్రం ఈయన్ని పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. తెలుగులో ఓ సినీ గేయ రచయత అవార్డు అందుకున్న రెండవ వ్యక్తి సీతారామశాస్త్రి. అంతకు ముందు డాక్టర్ సి.నారాయణ రెడ్డి పద్మ అవార్డు అందుకున్నారు. వీళ్ల కంటే ముందు ఎంతో మంది టాలెంటెడ్ గేయ రచయతలు ఉన్న వాళ్లెవరికి  పద్మ అవార్డులు దక్కకపోవడం విచారరకం.

అన్ని జానర్స్‌లో పాటలు రాసి తన కలానికి తిరుగులేదని నిరూపించారు. నిగ్గదీసి అడుగు, అర్థ శతాబ్ధపు లాంటి పాటలు సీతారామశాస్త్రిలోని సమాజ కవిని కూడా బయటికి తీసుకొచ్చాయి. ఇప్పటికీ వరసగా పాటలు రాస్తూనే ఉన్నారు ఈయన. ఇక కళ్లు సినిమాలో ఈయన తెల్లారిందో లెగండోయ్ అంటూ పాట రాయడమే కాదు.. పాడటం విశేషం.

తెలుగులో శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి సముద్రాల, కొసరాజు, వేటూరి తర్వాత  ఆ స్థాయి సినీ గేయ రచయతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ఏదైనా ప్రత్యేక పాట రాయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈయనే.

సీతారామశాస్త్రి  విడుదలకు సిద్ధంగా ఉన్న రాజమౌళి ’ఆర్ఆర్ఆర్’సినిమాలో కూడా పాటలు రాసారు ఈయన. అలాగే వెంకటేష్ నారప్పలో రెండు పాటలు రాసారు సిరివెన్నెల. కొండపొలంలోనూ ఈయన పాటలు రచించారు. ఏదేమైనా ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరిని లోటు అని చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Sirivennela Seetharama Sastry, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు