హోమ్ /వార్తలు /సినిమా /

Sirivennela Seetharama Sastry : అభిమానుల అశ్రు నయనాల మధ్య ముగిసిన సీతారామశాస్త్రి అంత్యక్రియలు..

Sirivennela Seetharama Sastry : అభిమానుల అశ్రు నయనాల మధ్య ముగిసిన సీతారామశాస్త్రి అంత్యక్రియలు..

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తి (Sirivennela Seetharama Sastry)

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తి (Sirivennela Seetharama Sastry)

Sirivennela Seetharama Sastry last Rights :  తెలుగు సినీ సాహితీ సౌరభంలో మరో పద్మం రాలిపోయింది. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. కాసేపటి క్రితమే ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ మహా ప్రస్థానంలో ముగిసింది. 

ఇంకా చదవండి ...

  Sirivennela Seetharama Sastry last Rights :  తెలుగు సినీ సాహితీ సౌరభంలో మరో పద్మం రాలిపోయింది. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. కాసేపటి క్రితమే ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ మహా ప్రస్థానంలో ముగిసింది.  గత నెల 24న న్యూమోనియాతో కిమ్స్ హాస్పిటల్‌లో చేరిన సిరివెన్నెల ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. సీతారామశాస్త్రి మరణంపై భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైయస్ జగన్  సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు సహా సినీ ప్రముఖులు అందరు నివాళులు అర్పించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి (66)  ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకడడంతో సగం ఊపిరితిత్తులు తీసేయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఆ తర్వాత ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన తనువు చాలించారు. 

  ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివ దేహాన్ని  ముందుగా ఆయన ఇంటికి.. అటు నుంచి అభిమానుల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. ఫిల్మ్ ఛాంబర్‌లో చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, నాని తో పాటు రాష్ట్ర  మంత్రులు  హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్ సిరివెన్నెల పార్ధివ దేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. ఈ సందర్బంగా ఆయనకు తెలుగు సినిమాకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

  Sirivennala Seetharama Sastry : చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ సహా సీతారామశాస్త్రికి పలువురు ప్రముఖుల నివాళులు..

  ఇక ఫిల్మ్ ఛాంబర్ నుంచి సిరివెన్నెల పార్ధివ దేహాన్ని ఫిల్మ్ నగర్‌లో ఉన్న మహా ప్రస్థానం శ్మశాన వాటికలో నిర్వహించారు. ఆయన అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.  సిరివెన్నెల పెద్ద కుమారుడు ఆయనకు అగ్ని సంస్కారం అందించారు. ఆయన పార్ధివ దేహాన్ని చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రముఖ ప్రజా కవి గద్దర్ ఆయన పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు.

  ఇద్దరం కలిసి అది తాగుదాం.. సీతారామశాస్త్రికి రామ్ గోపాల్ వర్మ విభిన్న నివాళి..

  ‘సిరివెన్నెల’ విషయానికొస్తే..  పదాలతో ప్రయోగాలు చేయడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య.. తెలుగు సినిమా పాటల పూదోటలో విరిసిన ఒకానొక పారిజాతపుష్పం. అక్షరాలనే కిరణాలు, పదాలనే తేజాలను సృష్టించారు. తన పాటలతో అక్షర సేద్యం చేసే కవి కర్షకుడు. అతని పాట ప్రతి నోటా అనేలా ఉంటాయి. అతని రాక తెలుగు సినిమా పాటకు ఏరువాక. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి.

  Sirivennela - SP Balu : 2020లో ఎస్పీ బాలు.. 2021లో సీతారామశాస్త్రి.. కుప్పకూలిన తెలుగు చిత్ర పరిశ్రమ సాహితీ సౌరభాలు..

  తెలుగులో దాదాపు అందరి హీరోలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. 2019 ఏడాదికి గాను కేంద్రం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించడం తెలుగు సాహిత్యానికి దక్కిన గౌరవంగా భావించాలి.

  Sirivennala Seetharama Sastry : సీతారామశాస్త్రి పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన పవన్, ఎన్టీఆర్, రాజమౌళి..


  సీతారామశాస్త్రి  విడుదలకు సిద్ధంగా ఉన్న రాజమౌళి ’ఆర్ఆర్ఆర్’సినిమాలో ‘దోస్తి’ సాంగ్  రాసారు ఈయన. అటు ‘శ్యామ్ సింగరాయ్’ తో పాటు పలు చిత్రాల్లో ఒకటి రెండు చిత్రాల్లో ఆయన గేయ పరిమళాలను ఆస్వాదించవచ్చు. ఈ యేడాది విడుదలైన వెంకటేష్ నారప్పలో రెండు పాటలు రాసారు సిరివెన్నెల. కొండపొలంలోనూ ఈయన పాటలు రచించారు. ఏదేమైనా ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరిని లోటు అని చెప్పాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Sirivennela Seetharama Sastry, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు