Home /News /movies /

SIRIVENNELA SEETHARAMA SASTRY BONDING WITH DIRECTOR K VISWANATH TA

Sirivennela Seetharama Sastry : కళా తపస్వీ విశ్వనాథ్‌తో సీతారామశాస్త్రి ప్రత్యేక అనుబంధం..

కళా తపస్వీ విశ్వనాథ్‌తో సిరివెన్నెల ప్రత్యేక అనుబంధం (File/Photo)

కళా తపస్వీ విశ్వనాథ్‌తో సిరివెన్నెల ప్రత్యేక అనుబంధం (File/Photo)

Sirivennela Seetharama Sastry :  తెలుగు సినీ సాహితీ సౌరభంలో మరో పద్మం రాలిపోయింది. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. ఈయనకు కళా తపస్వీ విశ్వనాథ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది.

    Sirivennela Seetharama Sastry :  తెలుగు సినీ సాహితీ సౌరభంలో మరో పద్మం రాలిపోయింది. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. తెలుగులో శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి సముద్రాల, కొసరాజు, వేటూరి తర్వాత  ఆ స్థాయి సినీ గేయ రచయతగా తన కంటూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.  ప్రస్తుతం తెలుగులో ఏదైనా ప్రత్యేక పాట రాయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈయనే. కాసేపటి క్రితమే న్యూమెనియా (ఊపిరితిత్తుల కాన్సర్)తో కన్నుమూసారు. సీతారామశాస్త్రి పాటలతో తెలుగు సినిమా పునీతమైందనే చెప్పాలి. ఈయన పాటలతో తెలుగు సినీ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కింది. ప్రముఖ దర్శకుడు కళాతపస్వీ విశ్వనాథ్ పరిచయంతో  దివంగత సీతారామశాస్త్రి జీవితమే మారిపోయింది.

    సినీ గేయ రచయతగా పరిచయం కాక ముందు ఈయన టెలిఫోన్ ఎక్సెంజీలో పనిచేసేవారు. చిన్పప్పటి నుంచే సాహిత్యంపై పట్టుతో ఆయనలోని కవి రాటుతేలారు. ఇక గంగావతరణం  రచన చూసిన విశ్వనాథ్ ఆయనకు తాను దర్శకత్వంలో వహించిన ‘జననీ జన్మభూమి సినిమాలో సినీ రచయతగా అవకాశం ఇచ్చారు.

    సిరివెన్నెల (File/Photo)


    ఆ తర్వాత సిరివెన్నెల సినిమాతో  ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారిపోయింది. .  ఆ సినిమా అంతగా  సక్సెస్ కాలేదు ఈ మధ్యకాలంలో . జైలు పక్షి, ఆది దంపతులు, లేడీస్ టైలర్ లాంటి సినిమాలకు కూడా పాటలు రాసారు సీతారామశాస్త్రి. ఆ తర్వాత కే.విశ్వనాథ్ 1986లో తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాకు అన్ని పాటలను సీతారామశాస్త్రి రాశారు. ఈ సినిమాతో చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు. ముఖ్యంగా ఆది భిక్షువు వాడిని ఏది కోరేది.. అంటూ ఆయన రాసిన పాటలు ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చింది.  ఈ సినిమాతో తొలి నంది అవార్డును అందుకున్నారు.

    Sirivennala Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరు తీసుకొచ్చిన చిత్రాలు..


    ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన ‘శృతి లయలు’, స్వయంకృషి, స్వర్ణ కమలం, ‘స్వాతి కిరణం వంటి చిత్రాలకు పనిచేసారు. వరుసగా 1986, 1987, 1988 వరుసగా మూడు సంవత్సరాలు .. సిరివెన్నెల, శృతి లయలు, స్వర్ణకమలం సినిమాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు. మొత్తంగా సిరివెన్నెలలోని టాలెంట్‌ను గుర్తించి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత మాత్రం విశ్వనాథ్‌కే దక్కుతుంది.

    సీతారామశాస్త్రి (File/Photo)


    37 యేళ్ల సినీ ప్రస్థానంలో 3 వేలకు పైగా పాటలు రచించారు. 2019లో కేంద్రం ఈయన్ని పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. తెలుగులో ఓ సినీ గేయ రచయత అవార్డు అందుకున్న రెండవ వ్యక్తి సీతారామశాస్త్రి. అన్ని జానర్స్‌లో పాటలు రాసి తన కలానికి తిరుగులేదని నిరూపించారు. నిగ్గదీసి అడుగు, అర్థ శతాబ్ధపు లాంటి పాటలు సీతారామశాస్త్రిలోని సమాజ కవిని కూడా బయటికి తీసుకొచ్చాయి. ఇప్పటికీ వరసగా పాటలు రాస్తూనే ఉన్నారు ఈయన.

    Sirivennela Seetharama Sastry : సినీ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత.. ప్రముఖుల నివాళి..


    సీతారామశాస్త్రి  విడుదలకు సిద్ధంగా ఉన్న రాజమౌళి ’ఆర్ఆర్ఆర్’సినిమాలో కూడా పాటలు రాసారు ఈయన. ఇక అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో ఓ పాటను కూడా ఈయన రాయడం విశేషం. అంతే కాకుండా పలు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.  అలాగే వెంకటేష్ నారప్పలో రెండు పాటలు రాసారు సిరివెన్నెల. కొండపొలంలోనూ ఈయన పాటలు రచించారు. ఏదేమైనా ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరిని లోటు అని చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: K viswanath, Sirivennela Seetharama Sastry, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు