Sirivennela - SP Balu : 2020లో ఎస్పీ బాలు.. 2021లో సీతారామశాస్త్రి.. కుప్పకూలిన తెలుగు చిత్ర పరిశ్రమ సాహితీ సౌరభాలు.. అవును తెలుగు చిత్ర పరిశ్రమ ఒక యేడాది వ్యవధిలోనే ఇద్దరు లెజెండ్స్‌ను కోల్పోయింది. ఎవరి పాట వినందే తెలుగు వారికి తెల్లారదో.. ఆయన గొంతు గతేడాది మూగపోయింది. బాలు గారి మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ఆయనలా పాట పాడగలిగే వారు ఇక భవిష్యత్తులో చూస్తామో లేదో చెప్పలేము. అంతలా తెలుగు లోగిళ్లలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మమేకమైపోయారు. తాజాగా తెలుగు సినీ సాహితీ సౌరభం సిరివెన్నెల కలం ఆగిపోయింది. సిరివెన్నెల రాసిన ఎన్నో పాటలను బాలు తన గాత్రంతో ఆలపించారు.
ముఖ్యంగా సిరివెన్నెల రాస్తూ నటించిన ‘గాయం’ సినిమాలో నిగ్గదీసి అడుగు పాటను .. బాలు తన గొంతులో ఎలా ఒలికించారో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోలేదు. ముఖ్యంగా సిరివెన్నల రాసిన ఆదిభిక్షువు వాడిని ఏమి అడిగేది..అంటూ ఆయన రాతకు బాలు పాడిన విధానం ఇప్పటికీ ఎవరు మరిచిపోలేరు.
Sirivennala Seetharama Sastry : సిరివెన్నెల సీతారామశాస్త్రి చనిపోవడానికి అసలు కారణం అదేనా..
విధాత తలపున..., అనాది జీవన వేదం అంటూ, సిరివెన్నెల కలం నుంచి జాలు వారిన సాహితి సౌరభం. ఈ గాలి, ఈ నీరు, ఈ ఊరు, సెలయేరు, ననుగన్న నా వాళ్ళు...అంటూ సీతారామశాస్త్రి వ్రాసిన ఆ పాటను, ఎంత మంది ఎన్ని లక్షల సార్లు పాడుకొని పులకించి ఉండుంటారో కదా. అలా సిరివెన్నెల పాటకు బాలు గాత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
ఇద్దరం కలిసి అది తాగుదాం.. సీతారామశాస్త్రికి రామ్ గోపాల్ వర్మ విభిన్న నివాళి..
పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు, రంగరిస్థివో, ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి వుంటదా...అని మామూలు అచ్చ తెనుగు పదాలతో శ్రీదేవి ని చూసి సంబరపడ్డ ఆ యువ సిరివెన్నెల ఇక లేరు కదా అని అనుకొంటే బాధే మరి...కానీ ఇన్నాళ్లూ మారుమ్రోగిన ఆ పాట, ఇక పైనా అలాగే ఉంటుంది...కానీ ఆ పాట రాసిన సిరివెన్నెల .. పాడిన బాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసారు.
సీతారామశాస్త్రి మరణంపై ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ, సినీ ప్రముఖులు నివాళి..
ప్రస్తుత తరంలో బాలులా పాడగలగడం.. సీతారామశాస్త్రిలా రాయగలడం అంత తేలిక కాదు. 2020 సెప్టెంబర్ 25న లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా కన్నుమూసారు. తెలుగు వాళ్లకు కరోనా చేసిన దుర్మార్గం ఏమిటంటే.. తేనేలూరే పాటలు పాడే బాలును మన నుంచి దూరం చేయడమే. ఇక యేడాది వ్యవధిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.. ఊపిరితిత్తుల కాన్సర్‌తో దూరం అయ్యారు. ఇక ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకరు లేనిదే మరొకరు లేరు. వీళ్లిద్దరు హాస్పిటల్‌లో జాయిన్ కావడం.. కొన్ని రోజుల పోరాటం తర్వాత కన్నుమూయడం వాళ్ల కుటుంబ సభ్యులకే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.
Sirivennala Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరు తీసుకొచ్చిన చిత్రాలు..
వాళ్లు లేని లోటును పూడ్చటం అంత తేలికైన విషయం కాదు. మొత్తంగా ఆ దేవుడికి కూడా ఎస్పీబాలు గాత్రం.. సీతారామశాస్త్రి కలం నుంచే వచ్చే సాహిత్యం కావాలనుకున్నారేమో.. అందుకే బాలు తర్వాత వెంటనే సిరివెన్నెలను కూడా స్వర్గానికి ఆహ్వానించినట్టు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: S. P. Balasubrahmanyam, Sirivennela Seetharama Sastry, Telugu Cinema, Tollywood