హోమ్ /వార్తలు /సినిమా /

Vaishnav Tej: రంగ రంగ వైభవంగా.. మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్

Vaishnav Tej: రంగ రంగ వైభవంగా.. మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్

 Vaishnav Tej Kethika Sharma (Photo Twitter)

Vaishnav Tej Kethika Sharma (Photo Twitter)

Vaishnav Tej Ranga Ranga Vaibhavamga: రంగరంగ వైభవంగా అంటూ మాస్ రోల్ తో ప్రేక్షకులను టచ్ చేయబోతున్నాడు వైష్ణవ్ తేజ్. తాజాగా ఈ సినిమా నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఉప్పెన మూవీతో తెలుగు తెరపై అడుగుపెట్టి మొదటి సినిమాతోనే ఫేమ్ కొట్టేశాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). రెండో సినిమాగా కొండపొలం చేసిన ఈ మెగా కాంపౌండ్ హీరో.. ఇప్పుడు రంగరంగ వైభవంగా (Ranga Ranga Vaibhavamga) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వైష్ణవ్ మూడో సినిమాగా ఈ మూవీ రాబోతోంది. ఈ సారి మాస్ రోల్ తో ప్రేక్షకులను టచ్ చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయిన నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ఓ బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.


సెప్టెంబర్ 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. రీసెంట్ గానే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి (Ranga Ranga Vaibhavamga Trailer) సినిమాపై హైప్ పెంచేసిన యూనిట్.. ఒక్కొక్కటిగా సాంగ్స్ వదులుతూ సంగీత ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నారు. ఫన్ అండ్ రొమాంటిక్‌ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటివరకు వదిలిన అప్‌డేట్స్ కన్ఫర్మ్ చేశాయి.


తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట వదిలారు. సిరి సిరి సిరి మువ్వల్లోనే.. దాగుండే చప్పుళ్లన్నీ అనే లైన్‌తో మొదలైన ఈ పాటలో మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. హీరోహీరోయిన్లపై అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ షూట్ చేశారు. జావేద్ అలీ, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటలో శ్రీ మని రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రేమలో పడిన హీరోహీరోయిన్ తమదైన లోకంలో విహరిస్తున్నట్లుగా ఈ సాంగ్ డిజైన్ చేశారు.


రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బాపినీడు బి సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గిరీశాయ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. మరోవైపు ఈ సినిమా ఓటీటీ హక్కులను (Aha )ఆహా స్ట్రీమింగ్ సంస్థ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఇది పోస్ట్- థియేట్రికల్ OTT బిజినెస్. సినిమా థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత OTTలో స్ట్రీమింగ్ కానుంది. చిత్రంలో నరేష్, ప్రభు, తులసి, శ్రీలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ కెరీర్ టర్న్ అవుతుందని అంతా భావిస్తున్నారు.Published by:Sunil Boddula
First published:

Tags: Ranga Ranga Vaibhavanga, Tollywood, Vaishnav tej

ఉత్తమ కథలు