హోమ్ /వార్తలు /సినిమా /

ఒకే ఒక్క పాత్రతో డిఫరెంట్‌గా 'హలో మీరా'.. రిలీజ్ డేట్ ఫిక్స్

ఒకే ఒక్క పాత్రతో డిఫరెంట్‌గా 'హలో మీరా'.. రిలీజ్ డేట్ ఫిక్స్

Hello Meera (Photo Twitter)

Hello Meera (Photo Twitter)

Hello Meera Release Date: గార్గేయి యల్లా ప్రగడ ప్రధాన పాత్రలో 'హలో మీరా' అనే సినిమా రాబోతోంది. ఒకే ఒక్క పాత్రతో సినిమాను తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఒక సినిమా అంటే ఎన్నో రకాలు పాత్రలు, ఎన్నో విభిన్న కారెక్టర్లుంటాయి. అలా ఉంటేనే సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని, రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేయొచ్చని అంతా అనుకుంటారు. కానీ పరిమితమైన పాత్రలతోనూ అద్భుతాలు చేయొచ్చని ఇది వరకు ఎన్నో సార్లు నిరూపితమైంది. అయితే ఇప్పుడు తెలుగులో మరో ప్రయత్నంగా గార్గేయి యల్లా ప్రగడ ప్రధాన పాత్రలో 'హలో మీరా' (Hello Meera) అనే సినిమా రాబోతోంది. ఒకే ఒక పాత్రతో సినిమాను తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి.

ఆ సాహసాన్ని హలో మీరా అంటూ ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ 'హలో మీరా' సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు కాకర్ల శ్రీనివాసు. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో.. డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఈ సినిమాను నిర్మించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. హలో మీరా మీద మంచి బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం, ఎక్కడా ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా చిత్రీకరించడంపై ప్రశంసలు కురిపించారు.

హలో మీరా సినిమాను ఏప్రిల్ 21న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇకపై మరింతగా ప్రమోషన్ కార్యక్రమాలు పెంచబోతున్నట్టుగా నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. ఎస్.చిన్న సంగీతం అందించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్‌గా, కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు. హిరణ్మయి కల్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు