హోమ్ /వార్తలు /సినిమా /

Alitho Saradaga: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన సింగర్ విజయ్?

Alitho Saradaga: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన సింగర్ విజయ్?

sp balasubramanyam, vijay prakash

sp balasubramanyam, vijay prakash

Alitho Saradaga: ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు విజయ్ ప్రకాష్. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, మరాఠి, హిందీ సినిమాలలో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Alitho Saradaga: ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు విజయ్ ప్రకాష్. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, మరాఠి, హిందీ సినిమాలలో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అవార్డులను కూడా అందుకున్నాడు. అంతేకాకుండా భక్తి పాటలు కూడా పాడి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు విజయ్. సుమారు ఐదు వేల పాటలు పాడిన ఈయన తన పాటలతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. 2008లో ఆస్కార్ బహుమతిను పొందిన జయహో పాటను పాడిన నలుగురిలో విజయ్ ప్రకాష్ కూడా పాడాడు. మధ్యలో జయహో అనే గొంతు విజయ్ ప్రకాష్ దే. ఇదిలా ఉంటే ఓసారి ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తే షాక్ కొట్టిందని తెలిపారు విజయ్.

తాజాగా విజయ్ ప్రకాష్ తన భార్య మహతితో ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఇందులో ఈ జంట తమ ఎంట్రీతో బాగా సందడిగా ఉండగా ఆలీ స్వాగతం చెబుతూ ఆహ్వానించాడు. ఎలా ఉన్నారని పలకరించడంతో వెంటనే మహతి బాగానే ఉన్నాం ఇప్పటిదాకా అంటూ పంచ్ వేసి నవ్వించింది.

https://youtu.be/f_UtoLqaibI

ఇక తమ వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. అంతేకాకుండా తమ ప్రేమ పరిచయం గురించి, ఆయనకు గుర్తింపు తెచ్చిన పాటలు గురించి ఇలా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదిలా ఉంటే దివంగత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం గారిని గుర్తుకు చేసుకున్నారు. ఇక ఆయనతో ఉన్న అనుబంధం గురించి విజయ్ ప్రకాష్ మాట్లాడాడు. ఓసారి బాలసుబ్రహ్మణ్యం తో మాట్లాడినప్పుడు ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తే షాక్ కొట్టినట్లు అనిపించిందని తెలిపాడు. అంతేకాకుండా ఓం శివోహం అనే పాటను కూడా పాడి వినిపించాడు విజయ్ ప్రకాష్. ఇక తమ జీవితంలో జరిగిన విషయాల గురించి పంచుకుంటూ బాగా సందడి చేశారు. ఇక ఈ ఎపిసోడ్ జూలై 12న ఈటీవీలో ప్రసారం కానుంది.

First published:

Tags: Alitho Saradaga, Comedian ali, Etv show, Singer vijay prakash, Sp bala subramanyam

ఉత్తమ కథలు