అత్తింటి వేధింపులు తట్టుకోలేక సింగర్ సుస్మిత ఆత్మహత్య..

Singer Sushmitha : అత్తింటి వేధింపులు తట్టుకోలేక వర్థమాన గాయని సుస్మిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

news18-telugu
Updated: February 18, 2020, 4:16 PM IST
అత్తింటి వేధింపులు తట్టుకోలేక సింగర్ సుస్మిత ఆత్మహత్య..
సుస్మిత Twitter
  • Share this:
Singer Sushmitha  : వర్థమాన గాయని సుస్మిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కన్నడ సినిమా పరిశ్రమలో సంచలనం రేపింది. ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకొన్న సింగర్ సుస్మిత జీవితం అర్ధాంతరంగా ముగియడం సినీ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. సుస్మిత (26) ఏడాదిన్నర కింద శరత్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. అక్కడ అత్తింట్లో ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేయడంతో చివరిగా ఆమె తన తల్లికి, సోదరుడికి వాట్సాప్‌లో మెసేజ్ పంపుతూ... వరకట్న వేధింపులే తన ఆత్మహత్యకు కారణం అని పేర్కోంది. తన భర్త శరత్‌తో పాటు ఆయన సోదరి గీత, అత్త వైదేహీలు తనను మానసికంగా వేధించారని.. ఈ వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్యకు పూనుకున్నానని తెలిపింది. కట్నం తేకుంటే ఇల్లు వదిలి వెళ్లిపోవాలని తనను పలుమార్లు వేధించారని.. ఇక తట్టుకోలేక పుట్టింటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నానని సింగర్ సుస్మిత తన తల్లికి పంపిన మెసేజ్‌లో పేర్కోంది. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తనను క్షమించాలని ఆ సూసైడ్ నోట్‌లో తన తల్లిని కోరింది. అంతేకాదు తనను ఇంతలా వేధించిన తన భర్తను, అతని కుటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలని, అప్పుడే తన ఆత్మ శాంతిస్తుందని ఈ సందర్భంగా సుస్మిత తన మెసేజ్‌లో రాసింది.

Singer Sushmitha suicide,dowry harassment,sushmita suicide,playback singer commits suicide,singer suicide,playback singer sushmita,kannada playback singer sushmita,news9 bengaluru,bangalore news today,live news in india,bengaluru,news today,latest news today,suicide,breaking news today,sushmita,singer,kannada singer,playback singer,annapoorneshwari nagar police station,annapoorneshwari nagar,సింగర్ సుస్మిత సూసైడ్,సుస్మిత సూసైడ్,సింగర్ సుస్మిత
భర్తతో సుస్మిత (ఫైల్ ఫోటో) Twitter


ఆదివారం సాయంత్ర తన భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన సుస్మిత.. రాత్రి తల్లి, అన్న సచిన్‌తో భోజనం చేసి అందరూ నిద్రిస్తుండగా సోమవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో షాక్‌గురైన సుస్మిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుస్మిత భర్త శరత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

 

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు