సినిమా సెలబ్రిటీల వారసులు సినీ ఎంట్రీ ఇస్తుండటం కామన్. సాధారణంగా హీరోహీరోయిన్ల తనయులు సినిమాల్లో వస్తుండటం చూస్తుంటాం. అయితే నిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ వారసుల ఎంట్రీ అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే సింగర్ సునీత (Singer Sunitha) తనయుడు ఆకాష్ (Aakash) హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సునీత, రామ్ వీరపనేని (Ram Veerapaneni) సహకారంతో ఆయన సినీ ఎంట్రీ ఫిక్సయింది. ఈ మేరకు తొలి సినిమా కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు (Raghavendra Rao) సపోర్ట్ అందడం విశేషం.
దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆయన హీరోగా సర్కారు నౌకరి అనే సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన చలనచిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఆకాష్ హీరోగా, నూతన నటి భావనా వళపండల్ హీరోయిన్ గా ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాలో జీ స్టూడియోస్ నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్చాన్ చేయగా, మ్యాంగో మీడియా అధినేత, గాయని సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు దేవుడి పటాలపై క్లాప్ నిచ్చారు.
అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన తొలిషాట్ కు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా గాయని సునీత కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా నిరవధికంగా షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో ఆకాష్, భావనా వళపండల్, తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ తదితరులు నటిస్తుండగా.. శాండిల్య సంగీతం అందిస్తున్నారు. సో.. చూడాలి మరి సునీత తనయుడి తొలి సినిమా సర్కారు నౌకరి ఆయనకు ఏ మేర ప్లస్ అవుతుందనేది!.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: K raghavendar rao, Singer Sunitha, Tollywood