Singer Sunitha: జీవితంలో అలాంటి అనుభవాలు ఎన్నో అంటూ సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్!

Singer sunitha

Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులందరికే పరిచయమే.. 'ఏమైంది ఈ వేళ' పాటతో తొలిసారిగా తన గొంతును వినిపించి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కదిలించింది.

  • Share this:
    Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులందరికే పరిచయమే.. 'ఏమైంది ఈ వేళ' పాటతో తొలిసారిగా తన గొంతును వినిపించి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. ఎన్నో సినిమాలలో ఎన్నో పాటలు పాడి మంచి అభిమానాన్ని అందుకుంది. బుల్లితెర షో లలో కూడా తన పాటలను వినిపించింది. సోషల్ మీడియాలో కూడా ఈమధ్య బాగా ముందుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా కొన్ని చేదు అనుభవాల గురించి పంచుకుంది సునీత.

    ఎన్నో రోజులు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత కొన్ని రోజుల కిందట రామ్ వీరపనేని అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత సునీతలో చాలా మార్పులు వచ్చాయి. ఇక ప్రస్తుతం బుల్లితెరలో జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ షో లో జడ్జిగా చేస్తుంది. ఇందులో ఆలీ, ఎస్వీ కృష్ణ రెడ్డి లు కూడా జడ్జీలుగా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ షో కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

    ఇందులో బాబు మోహన్ ఎంట్రీ బాగా సరదాగా కనిపించింది. అంతేకాకుండా ఆలీతో, కృష్ణ రెడ్డి తో కలిసి స్టెప్పులతో బాగా అలరించాడు. ఇక పిల్లలందరు తమ పర్ఫామెన్స్ లతో బాగా సందడి చేశారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో అబ్బాయిలతో స్నేహం చేస్తే సమాజం ఒక్కో విధంగా మాట్లాడుతుంటారు. ఈ విధంగా ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి ఓ స్కిట్ చేయగా.. తనతో స్నేహంగా ఉండే అబ్బాయిల గురించి తన ఇంటి చుట్టు వాళ్లు, తన ఆఫీస్ బాస్ ఇలా పలువురు నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంటారు. దీంతో ఈ స్కిట్ ప్రతి ఒక్కరిని బాగా కదిలించింది.



    దీంతో సింగర్ సునీత మాట్లాడుతూ.. రోడ్డు మీద వెళ్లే ఆంటీలు, ఆఫీస్ లో ఉండే బాస్ లు.. ఇవన్నీ కలిపి తన జీవితంలో ఒకే ఒక క్యారెక్టర్ అని తెలిపింది. కొన్నిసార్లు కుటుంబసభ్యుల కంటే స్వచ్ఛంగా ఉండేవాళ్ళు స్నేహితులని చెప్పుకొచ్చింది సునీత. ఇక ఇలా పిల్లలు తమ పర్ఫామెన్స్ లతో బాగా ఆకట్టుకోగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published: