Singer Sunitha: షాకింగ్.. సింగర్ సునీత రెండో పెళ్లి వాయిదా.. కారణం తెలుసా..?

సింగర్ సునీత (Photo : upadrastasunitha/Instagram)

Singer Sunitha: సింగర్ సునీత ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది. చాలా కాలంగా తనకు తెలిసిన బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో త్వరలోనే ఏడడుగులు వేయబోతుంది..

  • Share this:
సింగర్ సునీత ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది. చాలా కాలంగా తనకు తెలిసిన బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో త్వరలోనే ఏడడుగులు వేయబోతుంది సునీత. ఈమె పెళ్లి చేసుకోబోతుందనే విషయం తెలియగానే ఆమె అభిమానులతో పాటు సన్నిహితులు కూడా సోషల్ మీడియాలో సునీతకు కంగ్రాట్స్ తెలిపారు. కొన్ని రోజుల కింద డిజిటల్ మీడియా ప్రముఖుడు వీరపనేని రామ్‌తో ఈమె నిశ్చితార్థం జరిగింది. దాంతో అంతా మంచి నిర్ణయం తీసుకున్నారంటూ అండగా నిలుస్తున్నారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత.. కొన్నేళ్ల కాపురం తర్వాత విడిపోయింది. ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుంటూ చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉన్న సునీత.. ఇప్పుడు మరో కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది. ఈమె పెళ్లిపై ఇప్పుడు మరో అప్ డేట్ బయటికి వచ్చింది. నిన్నమొన్నటి వరకు కూడా సునీత పెళ్లి డిసెంబర్ 27న హైదరాబాద్‌లోనే జరగనుందని ప్రచారం జరిగింది. ఇదే విషయంపై సునీత బంధు వర్గం కూడా అవునన్నట్లే సుముఖంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈమె పెళ్లి 2020లో జరగడం లేదు.
singer sunitha marriage postponed,singer sunitha engagement,singer sunitha engagement ram veerapaneni,singer sunitha second marriage in feb 2021,singer sunitha husband,singer sunitha engagement video,singer sunitha interview,singer sunitha marriage,singer sunitha engagement pics,sunitha engagement,singer sunitha daughter,singer sunitha about her second marriage,singer sunitha daughter shreya,సింగర్ సునీత,సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్ వీడియో,సింగర్ సునీత రెండో పెళ్లి వాయిదా
సింగర్ సునీత (Singer Sunitha)

ఫిబ్రవరి 2021కు ఈ పెళ్ళి వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే రెండు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ పెళ్లిని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే సునీతకు అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: