• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SINGER SUNITHA RAM VEERAPANENI SINGER SUNITHA IS ANOTHER MIRACLE IN HONEYMOON FANS GET EXCITED TA

Singer Sunitha: హనీమూన్‌లో సింగర్ సునీత మరో అద్భుతం.. పెళ్లి తర్వాత తొలిసారి చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

Singer Sunitha: హనీమూన్‌లో సింగర్ సునీత మరో అద్భుతం.. పెళ్లి తర్వాత తొలిసారి చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

హనీమూన్‌లో సింగర్ సునీత మరో అద్భుతం (Instagram/Photo)

Singer Sunitha | హనీమూన్‌లో సింగర్ సునీత మరో అద్భుతం.. పెళ్లి తర్వాత తొలిసారి చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Singer Sunitha | హనీమూన్‌లో సింగర్ సునీత మరో అద్భుతం.. పెళ్లి తర్వాత తొలిసారి చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా. వివరాల్లోకి వెళితే..  టాలీవుడ్ ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో పెళ్లి గత నెల జనవరి 9న ఘనంగా జరిగింది. ఈయన ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్‌ను పెళ్లి చేసుకుంది. ఈయన డిజిటల్ మీడియాలో తోపు. ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉండి పాతుకుపోయాడు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. కానీ కరోనా లాక్‌డౌన్‌లో వీరి  పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. అంతేకాదు వెంటనే తాంబూలాలు (పూలు పండ్లు) మార్చుకుని పెళ్లి పీఠలు ఎక్కారు. వీరు పెళ్లి  వీళ్లిద్దరు పెద్దలతో పాటు పిల్లల సమక్షంలో  జరిగింది.  రామ్ వీరపనేని - సునీత వివాహాన్ని వారి పిల్లలే దగ్గరుండి జరిపించారు. అయితే సునీత పెళ్లిపై సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సునీత-రామ్ దంపతులను అందరూ అభినందిస్తుంటే.. మరికొందరు రెండో పెళ్లి చేసుకున్న సునీతను విమర్శించారు. సునీత రెండో పెళ్లిపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ కూడా వినబడ్డాయి. మరోవైపు సునీతకు ఏమంత వయసైపోయిందని.. రెండో పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

    తాజాగా సునీత తన భర్తతో కలిసి హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ తాను దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు తాజాగా సముద్ర తీరానా .. నిలబడి ఓ పాట పాడింది. ఈ సాంగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



    అంతేకాదు ఫ్యాన్స్ కూడా సింగర్ సునీత పెళ్లి తర్వాత తొలిసారి పాడింది. దీంతో అభిమానులు సునీత చేసిన పనిని మరో అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా సింగర్ సునీత రెండో పెళ్లి తర్వాత కూడా  పాటల దూకుడును ఇలా ప్రారంభించిందనే కామెంట్స్ వినబడుతున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు