మొక్కల యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బ్రేక్ లేకుండా కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని సినీ రాజకీయ సెలబ్రిటీలంతా నిర్విఘ్నంగా ముందుకు సాగుతున్నారు. కాలాల్ని, సంస్కృతుల్ని, స్మృతుల్ని తనలో మిలితం చేసుకొని సరికొత్తగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. తాజాగా ఈ ఛాలెంజ్‌లో ప్రముఖ సింగర్ సునీత పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్క నాటారు సింగర్ సునీత.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిది కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విదంగా మన ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే భావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు. అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు సునీత.
ఇక ఇప్పటికే అనేకమంది సినీ సెలబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్లో
ఉన్న ఆయన మొక్కలు నాటారు. ఇటీవలే నటి ప్రాంతిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంది. ప్రశాసన్ నగర్లో మంగళవారం ప్రాంతిక మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడడం సంతోషంగా ఉందన్న ప్రాంతిక.. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మనమే ప్రకృతిని కాపాడుకోవాలని, అందరు అడవులను సంరక్షించే బాధ్యత చేపట్టాలని కోరింది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.