Singer Sunitha: నిశ్చితార్థం తర్వాత తొలిసారి పెళ్లి గురించి మాట్లాడిన సునీత..

సింగర్ సునీత (Photo : upadrastasunitha/Instagram)

Singer Sunitha: కొన్ని రోజులుగా టాలీవుడ్ సింగర్ సునీత పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. అంతకుముందు ఆమె పేరు పాటల రూపంలో కానీ లేదంటే హోస్ట్‌గా బాగా వినిపించేది. కానీ గత రెండు వారాలుగా పెళ్లి విషయంలో వినిపిస్తుంది.

  • Share this:
కొన్ని రోజులుగా టాలీవుడ్ సింగర్ సునీత పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. అంతకుముందు ఆమె పేరు పాటల రూపంలో కానీ లేదంటే హోస్ట్‌గా బాగా వినిపించేది. కానీ గత రెండు వారాలుగా పెళ్లి విషయంలో వినిపిస్తుంది. ప్రముఖ మీడియా ప్రముఖుడు మ్యాంగ్ రామ్‌తో ఈమె నిశ్చితార్థం జరిగింది. కొన్ని రోజుల కింద ఇరు కుటుంబాల సమక్షంలో కొత్త జీవితానికి నాందీ పలికింది సునీత. అంతకు ముందు నుంచి వార్తలు వస్తున్నా కూడా తన పెళ్లిపై ఏ రోజు కూడా స్పందించలేదు ఈమె. ఉన్నట్లుండి ఓ మంచి రోజు ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అన్నీ కుదిర్తే డిసెంబర్ 26న పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఈ జోడీ. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరికి సునీత, రామ్ పెళ్లి వాయిదా పడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒక్కసారి కూడా సునీత తన పెళ్ళి గురించి మీడియా ముందు చర్చించలేదు. అసలు బయటికి కూడా రాలేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలే తప్ప సునీత తన పెళ్లి గురించి మాత్రం నోరు విప్పలేదు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అని.. ఇందులో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే తీరుతోనే ఈమె ముందుకు వెళ్తుంది.

సింగర్ సునీత (Photo : upadrastasunitha/Instagram)


అయితే ఇప్పుడు ఓ షాప్ ఓపెనింగ్‌కు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి వచ్చింది సునీత. అక్కడ కూడా కేవలం చీరల గురించి.. చీర కడితే వచ్చే పవిత్రత గురించి మాట్లాడింది. ఆ తర్వాత షాప్‌కు సంబంధించిన వాళ్లు మాత్రం సునీత పెళ్లి టాపిక్ తీసారు. ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుందని తెలిసి చాలా ఆనందించామంటూ చెప్పేసరికి పక్కనే ఉన్న సునీత పక్కున నవ్వింది. నిజానికి తన పెళ్లిని పెళ్లిలా కాకుండా రెండు కుటుంబాలు కలుస్తున్నాయి.. ఓ కుటుంబంలోకి మరో ఫ్యామిలీ వస్తుందనే కోణంలోనే చూడాలని చెప్పింది. అలాగే తాను చూస్తున్నానని.. అక్కడ ఓ దైవత్వం కనిపించిందని చెప్పింది సునీత.

తన పెళ్లికి అసలు కారణం కూడా రెండు కుటుంబాలను కలపడమే అంటూ చెప్పుకొచ్చింది ఈమె. మొత్తానికి నిశ్చితార్థం తర్వాత తొలిసారి పెళ్లి గురించి మాట్లాడటంతో ఈ వీడియో కూడా వైరల్ అవుతుందిప్పుడు. ఇదిలా ఉంటే 19 ఏళ్ల వయసులోనే సునీతకు తొలిసారి పెళ్లైంది. ప్రస్తుతం ఈమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్ల బాబోగులు కూడా ఈమె చూస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published: