Singer Sunitha: మెహందీ వేడుకలో మెరిసిపోతున్న కొత్త పెళ్లికూతురు సునీత..

సింగర్ సునీత మెహందీ వేడుక (Singer Sunitha)

Singer Sunitha: టాలీవుడ్‌ ప్రముఖ గాయని సునీత పెళ్ళి కూతురుగా ముస్తాబైంది. మరికొన్ని గంటల్లోనే ఈమె పెళ్లి పీటలెక్కబోతుంది. మీడియా బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనితో కొన్ని రోజుల కింద నిశ్చితార్థం జరుపుకున్న ఈమె జనవరి 9న ఆయనతో..

  • Share this:
టాలీవుడ్‌ ప్రముఖ గాయని సునీత పెళ్ళి కూతురుగా ముస్తాబైంది. మరికొన్ని గంటల్లోనే ఈమె పెళ్లి పీటలెక్కబోతుంది. మీడియా బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనితో కొన్ని రోజుల కింద నిశ్చితార్థం జరుపుకున్న ఈమె జనవరి 9న ఆయనతో కలిసి ఏడడుగులు నడవబోతుంది. ఈ క్రమంలోనే సునీత ఇంట మెహందీ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో సునీత స్నేహితురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్‌‌తో పాటు సుమ కనకాల కూడా వచ్చారు. అక్కడే ఉండి సునీతను పెళ్లి కూతురును చేసారు. ఆమె మెహందీ వేడుకలో కనువిందు చేసారు. పెళ్లి సమయం దగ్గర పడటంతో అభిమానులు కూడా ఈమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో పసుపు చీరలో మెరిసిపోతున్న సునీత ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మెహందీ పెట్టుకుని హాయిగా నవ్వుతూ కనిపిస్తుంది సునీత. ఈ ఫంక్షన్‌కు యాంకర్‌ సుమ కూడా హాజరయ్యారు. ఆ మధ్య గచ్చిబౌలిలోని ఓ స్టార్‌ హోటల్‌లో సునీత-రామ్‌ ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది.

దానికి ముందుగానే ఓ హోటల్‌లో స్నేహితులకు పార్టీ ఇచ్చారు ఈ జోడీ. ఇప్పుడు పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే వస్తున్నారు. దానికి తోడు చాలా తక్కువ మంది మాత్రమే రాబోతున్నారు. ఇందులో టాలీవుడ్‌ నటీనటులతో పాటు టాప్‌ సింగర్స్‌ మాత్రమే హాజరయ్యారు.

ఏదేమైనా కూడా సునీత పెళ్లి సందర్భంగా అభిమానులు అంతా ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు. కొత్త జీవితం మొదలు పెడుతున్న సందర్భంలో ఈమెకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: