Singer Sunitha Marriage : సింగర్ సునీత కాబోయే భర్త ఎవరు.. ఏం చేస్తాడో తెలుసా..

రామ్‌తో సునీత Photo : Twitter

Singer Sunitha Marriage : ప్రముఖ టాలీవుడ్ సింగర్‌ సునీత రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ఇటీవల కొన్నిరూమర్స్ రాగా.. వాటిని నిజం చేస్తూ.. సునీత ఈరోజు ఉదయం ఓ బిజినెస్‌ మ్యాన్‌తో నిశ్చితార్థం చేసుకుంది

 • Share this:
  Singer Sunitha Marriage : ప్రముఖ టాలీవుడ్ సింగర్‌ సునీత రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ఇటీవల కొన్నిరూమర్స్ రాగా.. వాటిని నిజం చేస్తూ.. సునీత ఈరోజు ఉదయం ఓ బిజినెస్‌ మ్యాన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే అసలు ఈ సింగర్ రెండో పెళ్లి చేసుకుంటున్న ఆ వ్యక్తి ఎవరా.. నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. సింగర్ సునీత పెళ్లిచేసుకుంటున్నట్లు ప్రకటించిన ఆ వ్యక్తి పేరు. రామ్.. రామ్ వీరపనేని. ఇతను డిజిటల్ మీడియాలో బాగానే రాణిస్తున్నాడు. యూట్యూబ్‌లో మ్యాంగో ఛానల్, వాక్కెడౌట్(whackedout) మీడియా సంస్థ అదినేత. రామ్ వీరప్పనేనిది కూడా ఇది రెండో వివాహమేనని తెలుస్తోంది. టాలీవుడ్‌ సోషల్ మీడియాలో రామ్ వీరపనేని కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఇక సింగర్ సునీత విషయానికి వస్తే.. ఆమె తెలుగులో చాలా పెద్ద సింగర్ అని తెలిసిందే. ఎన్నో మధురగీతాలను ఆలపించింది. ఆమె పాటలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక రెండో పెళ్లిపై సోషల్ మీడియా వేదిక స్పందించింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు కొన్ని వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్నీ ఆమె ఎపుడూఖండించలేదు. ఇక ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈరోజు క్లారిటీ వచ్చింది. సింగర్ సునీత ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో ధృవీకరించింది. డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మ్యాన్ రామ్‌ వీరపనేనితో తన పెళ్లి జరగబోతోందని తెలిపింది. దీనికి సంబందించిన సోమవారం ఉదయం అతనితో సునీత నిశ్చితార్థం జరిగిందని కూడా పేర్కోంది. కుటుంబ సభ్యుల సమక్షంలో అతికొద్దమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక గతంలో అంటే 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. అంతేకాదు ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా.. అయితే మొదటి భర్త తీరుతో విసిగిపోయిన సునీత.. విడాకులు తీసుకుంది. ఇక ఇన్నేళ్లు ఒంటరిగా ఉన్న ఈ టాలెంటెడ్ సింగర్ తాజాగా మరోసారి పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

  Like every mother, I dream of settling my children down well. At the same time I am blessed with wonderful and...

  Posted by Sunitha on Sunday, December 6, 2020


  తన పెళ్లి గురించి తన సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్’లో ఓ పోస్ట్ పెట్టిన సునీత భావోద్వేగం అవుతూ.. ప్రతి తల్లిలాగే, నా పిల్లలను బాగా స్థిరపడాలని కలలు కంటున్నాను. అదే సమయంలో నీను కూడా జీవితంలో స్థిరపడాలని చూడాలనుకునే పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నందకు సంతోషపడుతున్నాను. ఆ క్షణం వచ్చింది ... రామ్ నా జీవితంలో ఒక ముఖ్యమైన స్నేహితుడిగానే, ఓ అద్భుతమైన భాగస్వామిగా రాబోతున్నాడు. మేము ఇద్దరూ అతి త్వరలో వివాహం చేసుకోబుతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచాలని చూస్తాను.. అది అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఈ విషయంలో దయచేసి మీరు ఎప్పటిలాగే నాకు మద్దతు ఇవ్వాలనీ కోరుకుంటున్నాను అని పోస్ట్ చేసింది. ఇక మరోవైపు సునీత ఎంగేజ్‌మెంట్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో రెండో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేదని చెప్పిన ఆమె అనూహ్యంగా ఇలా ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published: