• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SINGER SUNITHA HUSBAND RAM VEERAPANENI PLANS TO GIVE SURPRISE HERE ARE THE DETAILS MK

సింగర్ సునీతకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన రామ్ వీరపనేని...ఏంటో తెలిస్తే షాక్ తింటారు...

సింగర్ సునీతకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన రామ్ వీరపనేని...ఏంటో తెలిస్తే షాక్ తింటారు...

భర్త పిల్లలతో సింగర్ సునీత (ప్రతీకాత్మక చిత్రం )

ఇప్పటికే విహార యాత్రకు వెళ్లి వచ్చిన దంపతులు తాజాగా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సునీత తన వివాహం తర్వాత కుమార్తె కెరీర్ సెట్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

  • Share this:
    ప్రముఖ సింగర్ సునీత, రామ్ వీరపనేని దాంపత్య జీవితం సరదాగా సాగిపోతంది.  ఇప్పటికే సునీత తమ కొత్త వైవాహిక జీవితానికి సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియా ద్వారా తరచూ చెబుతూనే ఉంది. తాజాగా సునీత తన జీవితంలో వచ్చిన కొత్త వ్యక్తి అయిన రామ్ వీరపనేని పట్ల చాలా కేరింగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరూ కలిసి వాలెంటైన్స్ డే రోజు ఓ ఇంటర్వ్యూ కూడా ఇఛ్చారు.  అటు రామ్ వీరపనేని సైతం సింగర్ సునీత కోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా వివాహం జరిగిన తర్వాత వేలంటైన్ డే సందర్భంగా సునీతను సర్ ప్రైజ్ ఇచ్చిన రామ్ వీరపనేని మరో ఒక విలువైన కానుక ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విహార యాత్రకు వెళ్లి వచ్చిన దంపతులు తాజాగా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సునీత తన వివాహం తర్వాత కుమార్తె కెరీర్ సెట్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. సునీత కుమార్తె శ్రేయ ఇప్పటికే నేపథ్య గాయనిగా మంచి పేరు సంపాదించింది. అంతేకాదు సునీత పేరును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతోంది. అయితే రామ్ వీరపనేని సైతం కుమార్తె శ్రేయ కెరీర్ కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సునీతకు ఒక రకంగా బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి.

    ఇక సునీత కుమారుడు సైతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. అతడు సైతం తన విద్యాభ్యాసం అయిన తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం చేయడం ద్వారా సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. అటు రాం వీరపనేని సైతం సునీత పిల్లల కెరీర్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక సునీత సైతం ముందుగా ఇచ్చిన కమిట్ మెంట్స్ ప్రకారం షోస్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. దీంతో సునీత త్వరలోనే బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. అలాగే పలువురు హీరోయిన్లు సునీత గాత్రం ఎప్పుడు దొరుకుతుందా ఎదురు చూస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. ఆ కమిట్స్ మెంట్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇక సునీత ఇలా బిజీగా తన డైరీ మొత్తం పూర్తి చేయాల్సి ఉంది.

    అలాగే సునీత త్వరలోనే పాడుతా తీయగా తరహాలో కొత్త ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అన్నీ కుదిరితే అతి త్వరలోనే మరో మ్యూజికల్ రియాలిటీ షో స్టార్ట్ కావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2021 లో సునీత చాలా బిజీ అయ్యే అవకాశం ఉంది.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు