SINGER SUNITHA HUSBAND RAM VEERAPANENI GETS IN CONTROVERSY A VIDEO GOES VIRAL SR
Singer Sunitha : మా కులానికి చెందిన మహిళలను అసభ్యంగా చూపిస్తావా.. సింగర్ సునీత భర్తకు వార్నింగ్.. వీడియో వైరల్..
Ram Veerapaneni, Singer Sunitha Photo : Twitter
Singer Sunitha : తెలుగు పాపులర్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన పాటలతో పాటు అందచందాలతో తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీని సంపాదించుకున్నారు.
తెలుగు పాపులర్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన పాటలతో పాటు అందచందాలతో తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆమె ఆ మధ్య రామ్ వీరపనే అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే భర్త రామ్ వీరపనేని ప్రస్తుతం చిక్కుల్ల పడ్డారు. రామ్ వీరపనేనికి ఓ యూట్యూబ్ చానెల్ ఉందన్న సంగతి తెలిసిందే. మ్యాంగో మీడియా అధినేతగా ఆయనకు మంచి పేరుంది. అయితే తాజాగా ఆయన పేరు, ఆయన ట్యూబూబ్ ఛానెల్ ఓ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రామ్ వీరపనేని మ్యాంగో యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేవిధంగా ఉన్నాయని.. కావాలనే ఆ సామాజిక వర్గ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ ఆరోపణలు చేస్తూ ఆ కులానికి చెందిన కొందరు వ్యక్తులు అందోళన చేస్తున్నారు. అంతేకాదు కొందరు హైదరాబాద్లోని రామ్ వీరపనేని ఆఫీస్కు వచ్చి హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తమ కుల మహిళలను ఉద్ధేశిస్తూ, వారిని కించపరుస్తూ తీసిన ఆ వీడియోలను వెంటనే తమ యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు ఆ కులానికి చెందిన కొందరు వ్యక్తులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వివాదంతో ఒక్కసారిగా సింగర్ సునీత పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక సింగర్ సునీత విషయానికి వస్తే.. బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టారు. సునీత గతంలో అంటే 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల కాపురం తర్వాత విడిపోయారు. ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుంటూ చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉన్న సునీత.. రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.