Singer Sunitha: పిల్లల విషయంలో రామ్ వీరపనేని అనూహ్య నిర్ణయం.. కన్నీరు పెట్టుకున్న సింగర్ సునీత..

సింగర్ సునీత రామ్ వీరపనేని (Singer Sunitha Ram Veerapaneni)

Singer Sunitha: కొన్ని రోజులుగా టాలీవుడ్ సింగర్ సునీత వార్తల్లో ఉంటూనే వస్తుంది. దానికి కారణం ఆమె రెండో పెళ్లి. తన మనసుకు నచ్చిన రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుని భర్తతో హాయిగా ఉంది ఈ సింగర్. సునీత చేసిన పనికి చాలా మంది అండగా నిలిచారు.

  • Share this:
కొన్ని రోజులుగా టాలీవుడ్ సింగర్ సునీత వార్తల్లో ఉంటూనే వస్తుంది. దానికి కారణం ఆమె రెండో పెళ్లి. తన మనసుకు నచ్చిన రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుని భర్తతో హాయిగా ఉంది ఈ సింగర్. సునీత చేసిన పనికి చాలా మంది అండగా నిలిచారు. చాలా ఏళ్లుగా ఒంటరిగానే జీవితం గడిపిన సునీత ఇన్నాళ్ళకు తోడు తెచ్చుకుంది. తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుతం భర్త రామ్ వీరపనేనితో కలిసి హాయిగా కొత్త జీవితం ఎంజాయ్ చేస్తుంది సునీత. పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంది ఈ గాయని. తన జీవితంలో జరుగుతున్న కొత్త కొత్త సంగతులను సన్నిహితులతో పాటు అభిమానులతో కూడా పంచుకుంటుంది ఈమె. ఇదిలా ఉంటే సింగర్ సునీత జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా అభిమానులు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈమె భర్త రామ్ వీరపనేని గురించి కూడా కొన్ని విషయాలు బయటికి వస్తున్నాయి. ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు సునీత షాక్ అవ్వడమే కాదు.. కన్నీరు కూడా పెట్టుకుంటుందని సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. అంతగా ఏం చేసాడబ్బా అనుకోవచ్చు కానీ ఎమోషనల్‌గా సునీతను కదిలిస్తున్నాడు రామ్. ఈయన మంచి బిజినెస్ మ్యాన్. ఇండస్ట్రీలో ఈయనకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. మ్యాంగో రామ్ అంటారు ఈయన్ని.

singer sunitha husband ram veerapaneni,singer sunitha children,singer sunitha ram veerapaneni children,singer sunitha second marriage,singer sunitha engagement ram veerapaneni,singer sunitha,singer sunitha husband,singer sunitha engagement video,singer sunitha interview,singer sunitha marriage,singer sunitha engagement pics,sunitha engagement,singer sunitha daughter,singer sunitha about her second marriage,singer sunitha daughter shreya,సింగర్ సునీత,సింగర్ సునీత పిల్లలు,సింగర్ సునీత రామ్ వీరపనేని పిల్లలు,సునీత పిల్లలకు రామ్ వీరపనేని ఆస్తులు
సింగర్ సునీత రామ్ వీరపనేని (Singer Sunitha Ram Veerapaneni)


కోట్లాది వ్యాపారాలు ఉన్న ఈయన పెళ్లి తర్వాత తన బిజినెస్ విషయంలో కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా సునీత పిల్లల విషయంలో రామ్ వీరపనేని తీసుకుంటున్న నిర్ణయాలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా సునీతకు పిల్లలు అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. వాళ్ల కోసమే తాను ఉన్నానని చెప్పేది సునీత. అలాంటి పిల్లల అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకుంది సునీత. రామ్, పిల్లల మధ్య ఉన్న బంధం విషయంలో కూడా తాను చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది ఈమె.

singer sunitha husband ram veerapaneni,singer sunitha children,singer sunitha ram veerapaneni children,singer sunitha second marriage,singer sunitha engagement ram veerapaneni,singer sunitha,singer sunitha husband,singer sunitha engagement video,singer sunitha interview,singer sunitha marriage,singer sunitha engagement pics,sunitha engagement,singer sunitha daughter,singer sunitha about her second marriage,singer sunitha daughter shreya,సింగర్ సునీత,సింగర్ సునీత పిల్లలు,సింగర్ సునీత రామ్ వీరపనేని పిల్లలు,సునీత పిల్లలకు రామ్ వీరపనేని ఆస్తులు
సింగ‌ర్ సునీత పిల్ల‌లు (Singer Sunitha Instagram)


ఇదిలా ఉంటే ఇప్పుడు సునీత పిల్లలకి కూడా తన ఆస్తుల్లో వాటా ఇవ్వాలని రామ్ వీరపనేని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. ఇద్దరు పిల్లలను కూడా తన వ్యాపారాల్లోకి తీసుకురావాలని చూస్తున్నాడు ఈయన. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు చూసి సునీత అభిమానులు కూడా సంతోషపడుతున్నారు. ఎంత మంచివాడు మీకు తోడుగా దొరికాడు అంటూ రామ్ వీరపనేనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: