Singer Sunitha Marriage: సింగర్ సునీత పెళ్లిలో షాకింగ్ ఘటన...ఇది గమనించారా...అందరూ చూస్తుండగానే...

సింగర్ సునీత మెహందీ వేడుక (Singer Sunitha)

సింగర్ సునీత వివాహం సమయంలో ఆమె కుమార్తె కాస్త ఎమోషనల్ అవ్వడం నెట్టింట వైరల్ అయ్యింది. అయితే దీని వెనుక కారణం లేకపోలేదని అంటున్నారు.

  • Share this:
    సింగర్ సునీత పెళ్లి అంగరంగ వైభవంగా ముగిసిింది. ఈ వివాహానికి రాజకీయ, సినీ ప్రముఖులు అంతా హాజరయ్యారు. శంషాబాద్ లోని రామాలయంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకకు అటు సునీత బంధువులతో పాటు వరుడు రామ్ వీరపనేని తరపు బంధు మిత్రులు కూడా హాజరు అయ్యారు. అయితే ఇక్కడ ఒక అనుకోని సంఘటన జరిగింది. సునీత వివాహం మొత్తంలో ఆమె కుమార్తె, కుమారుడు సైతం చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. నిజానికి తమ తల్లి వివాహాన్ని వారే దగ్గరుండి చేశారు. అటు తండ్రిగా రామ్ వీరపనేనిని యాక్సెప్ట్ చేయడం నెటిజన్లను ఆకర్షించింది. అటు సింగర్ సునీత వివాహం సమయంలో ఆమె కుమార్తె కాస్త ఎమోషనల్ అవ్వడం నెట్టింట వైరల్ అయ్యింది. అయితే దీని వెనుక కారణం లేకపోలేదని అంటున్నారు. నిజానికి సునీత వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె మొదటి భర్త కూడా సినిమా ఇండస్ట్రీ తో సంబంధాలు ఉన్న కిరణ్ అనే వ్యక్తితో పెద్దలు కుదర్చగా పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం బాగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఆకాష్ మరియు శ్రీయ. సునీత సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేపథ్యంలో కిరణ్ తో అనేక మనస్పర్థలు రావడంతో ఇద్దరు దశాబ్దం క్రితం విడిపోయి వేరుగా జీవిస్తున్నారు.  అప్పటి నుంచి పిల్లలు అటు సునీత వద్ద కొంత కాలం, తండ్రి వద్ద కొంత కాలం ఉంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తమ కుటుంబం విచ్చిన్నం అవ్వడం తెలిసిందే. దీంతో్ పిల్లలు చాలా కలత చెందారు. కాగా ప్రస్తుతం రామ్ వీరపనేని రాకతో వారిక కుటుంబం ఫ్యామిలీ ఫోటో కంప్లీట్ అయ్యింది. దీంతో సునీత కుమార్తె చాలా ఎమోషనల్ అయినట్లు సమాచారం.

    మరోవైపు సునీత కుమార్తె  సైతం ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నారు. సునీత కూతురు సైతం నాగ చైతన్య సినిమా అయినా సవ్యసాచి తో సింగర్ గా టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఇక అబ్బాయి ఆకాష్ మాత్రం పై చదువులు చదువుతున్నాడు. ప్రస్తుతం రామ్ రాకతో వారి కల నెరవేరింది. తమ తల్లికి ఓ తోడు దొరికిందని పిల్లలు ఇద్దరూ ఆనందరం వెల్లిబుచ్చారు.
    Published by:Krishna Adithya
    First published: