హోమ్ /వార్తలు /సినిమా /

కొరమీను: ఈ రోజుల్లో మంచి కంటెంటే హీరో.. సింగర్ సునీత కామెంట్స్

కొరమీను: ఈ రోజుల్లో మంచి కంటెంటే హీరో.. సింగర్ సునీత కామెంట్స్

Korameenu (Photo News 18)

Korameenu (Photo News 18)

Singer Sunitha: మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'కోరమీను'. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. తాజాగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'కోరమీను' (Korameenu). స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. ఆనంద్ రవి (Anand Ravi) కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’.

డిసెంబర్ 31న సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘తెలిసిందే లే..’ అనే సాంగ్ రిలీజ్ ఈవెంట్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బింబిసార ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌, సింగర్ సునీత్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జరిగిన పాత్రికేయుల స‌మావేశంలో.. లిరిసిస్ట్ ల‌క్ష్మీ ప్రియాంక‌, పూర్ణాచారి, జ‌బ‌ర్ద‌స్త్ ఇమ్మాన్యుయేల్‌, ఇందు కుసుమ, కిషోరి త‌దిత‌రులు మాట్లాడారు.

జ‌బ‌ర్ద‌స్త్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ‘‘కామెడీ అనే కాకుండా ఓ మంచి రోల్ ఇచ్చిన మా డైరెక్ట‌ర్ శ్రీప‌తి గారికి థాంక్స్‌. కొర‌మీను అనే టైటిల్ విన‌గానే ఆశ్చ‌ర్య‌పోయాను. నిజంగానే రేపు సినిమా చూస్తే ఈ టైటిల్ ఎంద‌కు పెట్టార‌ని అర్థ‌మ‌వుతుంది. ఆనంద్ ర‌విగారు నీడ‌ను బేస్ చేసుకుని నెపొలియ‌న్ అనే సినిమా చేశారు. ఇప్పుడు కొర‌మీను సినిమా చేశారు. స‌పోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు.

హీరోయిన్ కిషోరీ దత్రక్ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత సమన్య రెడ్డి గారికి థాంక్స్. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చేశాం. ఆయ‌న ఇంకా మ‌రెన్నో సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ శ్రీప‌తిగారు మీనాక్షి అనే మంచి రోల్ ఇచ్చారు. హరీష్ ఉత్తమన్ గారితో కాంబినేషన్ సీన్స్ చక్కగా కుదిరాయి. నా పాత్ర మంచి ఇంపాక్ట్ ఉంటుంది. త‌ప్ప‌కుండా సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది. సినిమాలో ప‌ని చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు శ్రీప‌తి క‌ర్రి మాట్లాడుతూ.. ‘‘మా టీమ్‌కి స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన దర్శకులు వ‌శిష్ట‌గారికి, సింగర్ సునీత గారికి థాంక్స్‌. సినిమాకు కథ ప్ర‌ధానం. అది బావుంటే అన్నింటినీ అదే తీసుకొస్తుంది. ఆనంద్ ర‌విగారు అంత మంచి క‌థ‌ను ఇచ్చారు. ఆయ‌న ద‌గ్గ‌రే విష‌యాలు నేర్చుకున్నాను. మా గురువు గారినే డైరెక్ట్ చేశాను. క‌థ‌ను చ‌క్క‌గా డ్రైవ్ చేసేది టీమ్‌. ఆ టీమ్‌కు స‌పోర్ట్ చేసేది నిర్మాత స‌మ‌న్య రెడ్డి గారు. సినిమాను మ‌న కోసం అనుకున్నాం. మ‌న కోసం చేసుకుంటూ శాటిస్పై చేస్తే అంద‌రినీ శాటిస్పై చేయ‌వ‌చ్చు అన్నారు. అలాంటి నిర్మాత దొరికినందుకు చాలా అదృష్ట‌వంతుడిని. పూర్ణాచారి, ప్రియాంక‌గారుచ‌క్క‌గా లిరిక్స్ రాశారు. ఆనంత్ నారాయ‌ణ్ నెక్ట్స టాక్ ఆఫ్ ది టౌన్ అవుతారు. శ‌త్రుగారు అద్భుత‌మైన పాత్ర చేశారు. ఇందు, కిషోరి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. డేడికేష‌న్ లెవ‌ల్ వ‌ల్ల వాళ్లు ఇంకా ఎదుగుతారు. నేను వైజాగ్‌లో పుట్టి పెరిగాను. దాన్ని డిఫరెంట్‌గా చూపించాల‌ని అనుకున్నాను. ముందుగానే ప్రీ వ‌ర్క్ చేసి షూటింగ్ చేశాం'' అన్నారు.

సింగ‌ర్ సునీత్ మాట్లాడుతూ.. ‘‘కొరమీను’ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒకరికి నా బెస్ట్ విషెస్. ఈ రోజుల్లో మంచి కంటెంటే హీరో. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే గీత‌లు చెరిగిపోయాయి. కంటెంట్ బావుంటే కొత్త న‌టీన‌టుల‌తో చేసిన మూవీ అయినా ప్ర‌పంచ వ్యాప్తంగా పేరుని సంపాదించుకుంటుంది. అటువంటి లిస్టులో కొర‌మీను సినిమా కూడా చేరుతుంది. న‌మ్మి డ‌బ్బులు పెట్టిన స‌మ‌న్య రెడ్డిగారికి ఆల్ ది బెస్ట్‌. ఆనంద్ ర‌విగారు నాకు హ్యాపీడేస్ నుంచి ప‌రిచ‌యం. ఆయ‌న మంచి రైట‌ర్‌, న‌టుడు అయ్యారు. ఆయ‌న‌కు కంగ్రాట్స్‌. టీజ‌ర్ చూడ‌గానే మీసాల గురించి ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేయ‌వ‌చ్చా అనిపించింది. డైరెక్ట‌ర్‌కి హ్యాట్సాఫ్‌. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనంత్ వ‌ర్క్ చూస్తే త‌న ఫ‌స్ట్ సినిమాలాగా అనిపించ‌లేదు. క‌చ్చితంగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు. మ‌న జీవన విధానానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమాలు స‌క్సెస్ అవుతాయి. అలాంటి ఓ సినిమానే కొర‌మీను. అలాంటి మంచి కాన్సెప్ట్‌తో వ‌చ్చిన ఇది కూడా త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంది. సాంగ్స్‌, మ్యూజిక్ ద్వారా ఈ పాట‌లు రిలీజ్ కావటం నాకెంతో గ‌ర్వంగా ఉంది’’ అన్నారు.

హీరో ఆనంద్ ర‌వి మాట్లాడుతూ.. ‘‘కొరమీను సినిమాలో మీసాల రాజుకి మీసాలు ఎందుకు తీసేశార‌నే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ ప్ర‌పంచ‌మంతా సినిమాల్లో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, కిడ్నాప్ మిస్ట‌రీలుంటాయి. కానీ ఓ మ‌నిషికి మీసాలు ఎవ‌రు తీసేసుంటార‌నే కాన్సెప్ట్ ఎక్క‌డా లేదు. కాబ‌ట్టి ఇదొక జోనర్ మూవీ అనొచ్చు. దీన్నొక మీసాల మిస్ట‌రీ అనుకోవ‌చ్చు. క‌థ పుట్టిందే అక్క‌డ నుంచే. పేద‌వాడికి, గొప్ప వాడికి మ‌ధ్య జరిగే గొడ‌వను క‌థ‌లో తీసుకున్నాం. సినిమాలో చివ‌రి ముప్పై నిమిషాలు ఎంతో కీల‌కం. మీరు సినిమా చూస్తే స‌ర్ ప్రైజ్ అవుతారు. మా టీమ్‌కు చ‌క్క‌గా చూసుకున్న నిర్మాత‌గారికి థాంక్స్‌. థ్రిల్ల‌ర్ మూవీయే కాదు.. మంచి మ్యూజిక్ కంటెంట్ కూడా ఉంది. మ్యూజిక‌ల్ ఫిల్మ్‌గా సినిమాను ఎంజాయ్ చేస్తారు. డిసెంబ‌ర్ 31న సినిమాను చూసి న్యూ ఇయ‌ర్‌ను హ్యాపీగా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని కోరుకుంటున్నాను. మేం కూడా అంతే హ్యాపీగా న్యూ ఇయ‌ర్‌ను సెల‌బ్రేట్ చేసుకునేలా చేస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

First published:

Tags: Singer Sunitha, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు