Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /సినిమా /

Singer Sunitha Marriage : బిజినెస్ మ్యాన్‌‌ను పెళ్లిచేసుకుంటున్న సునీత.. ఫేస్‌బుక్ వేదికగా ప్రకటన..

Singer Sunitha Marriage : బిజినెస్ మ్యాన్‌‌ను పెళ్లిచేసుకుంటున్న సునీత.. ఫేస్‌బుక్ వేదికగా ప్రకటన..

సింగర్ సునీత (Photo : upadrastasunitha/Instagram)

సింగర్ సునీత (Photo : upadrastasunitha/Instagram)

Singer Sunitha Engagement : ప్రముఖ సింగర్‌ సునీత రెండో పెళ్లిపై వస్తోన్న‌ రూమర్స్‌ను నిజం అయ్యాయి.

Singer Sunitha Engagement : ప్రముఖ సింగర్‌ సునీత రెండో పెళ్లిపై వస్తోన్న‌ రూమర్స్‌ను నిజం అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు కొన్ని వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్నీ ఆమె ఎపుడూఖండించలేదు. ఇక ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈరోజు క్లారిటీ వచ్చింది. సింగర్ సునీత ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో ధృవీకరించింది. డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మ్యాన్ రామ్‌ వీరపనేనితో తన పెళ్లి జరగబోతోందని తెలపింది. దీనికి సంబందించిన సోమవారం ఉదయం అతనితో సునీత నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో అతికొద్దమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక గతంలో అంటే 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. అంతేకాదు ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా.. అయితే మొదటి భర్త తీరుతో విసిగిపోయిన సునీత.. విడాకులు తీసుకుంది. ఇక ఇన్నేళ్లు ఒంటరిగా ఉన్న ఈ టాలెంటెడ్ సింగర్ తాజాగా మరోసారి పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది.


Like every mother, I dream of settling my children down well. At the same time I am blessed with wonderful and...

Posted by Sunitha on Sunday, December 6, 2020


తన పెళ్లి గురించి తన సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్’లో ఓ పోస్ట్ పెట్టిన సునీత భావోద్వేగం అవుతూ.. ప్రతి తల్లిలాగే, నా పిల్లలను బాగా స్థిరపడాలని కలలు కంటున్నాను. అదే సమయంలో నీను కూడా జీవితంలో స్థిరపడాలని చూడాలనుకునే పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నందకు సంతోషపడుతున్నాను. ఆ క్షణం వచ్చింది ... రామ్ నా జీవితంలో ఒక ముఖ్యమైన స్నేహితుడిగానే, ఓ అద్భుతమైన భాగస్వామిగా రాబోతున్నాడు. మేము ఇద్దరూ అతి త్వరలో వివాహం చేసుకోబుతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచాలని చూస్తాను.. అది అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఈ విషయంలో దయచేసి మీరు ఎప్పటిలాగే నాకు మద్దతు ఇవ్వాలనీ కోరుకుంటున్నాను అని పోస్ట్ చేసింది. ఇక మరోవైపు సునీత ఎంగేజ్‌మెంట్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో రెండో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేదని చెప్పిన ఆమె అనూహ్యంగా ఇలా ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఇక సునీత కెరీర్ విషయానికి వస్తే.. ఆమె గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చెప్పాలంటే టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమెకు ఉంది.

First published:

Tags: Singer Sunitha, Tollywood Movie News

ఉత్తమ కథలు