Home /News /movies /

Singer Sunitha: తనపై వస్తున్న ఆ వార్తలను ఖండించిన సింగర్ సునీత..

Singer Sunitha: తనపై వస్తున్న ఆ వార్తలను ఖండించిన సింగర్ సునీత..

సింగర్ సునీత (Singer sunitha)

సింగర్ సునీత (Singer sunitha)

Singer Sunitha: తనపై వస్తున్న ఆ వార్తలను ఖండించిన సింగర్ సునీత.. వివరాల్లోకి వెళితే..

    Singer Sunitha: తనపై వస్తున్న ఆ వార్తలను ఖండించిన సింగర్ సునీత.. వివరాల్లోకి వెళితే.. సింగర్ సునీత.. ఈ యేడాది మొదట్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త మ్యాంగ్ వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహాం చేసుకున్నారు. వీళ్లిద్దరికి ఇది రెండో పెళ్లి. వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో విభిన్న వాదాలు వినిపించాయి. అయితే పెళ్లి తర్వాత కూడా సునీత వార్తల్లో నిలుస్తునే ఉన్నారు. ఇక సునీత.. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈటీవీలో హోస్ట్ చేసిన పాడుతా తీయగాకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ రియాలిటీ షోలో ఈమెతో పాటు ఎస్పీ చరణ్, ప్రముఖ పాటల రచయత చంద్రబోస్ జడ్జ్‌గా వ్యవహరించనున్నట్టు సమాచారం. తాజాగా సునీత తన భర్త రామ్ వీరపనేనితో కలిసి వెబ్ సిరిస్ నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సునీత క్లారిటీ ఇచ్చారు. తాము వెబ్ సిరీస్‌ నిర్మిస్తున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

    ప్రస్తుతం నేను సింగింగ్‌తో ఎంతో ఆనందంగా ఉన్నాము. మాకు ఉన్నంతలో ఎంతో ఆనందంగా  ఉన్నాము. అందులో పైకి రావడానికి ప్రయత్నిస్తాము. అంతేకాదు డబ్బింగ్‌‌లతో ఎంతో హ్యాపీగా ఉన్నట్టు పేర్కొన్నారు. గతంలో సునీత సినిమాల్లో నటిగా ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. దాంతో పాటు బిగ్‌బాస్ సీజన్ 5‌లో పాల్గొనబోతున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిపై కూడా సునీత క్లారిటీ ఇచ్చేసింది.  తాజాగా సునీత తన భర్తతో కలిసి వెబ్ సిరీస్‌ నిర్మిస్తున్నట్టు వస్తున్న వార్తలను కూడా ఖండించింది. మొత్తంగా గత కొన్ని రోజులుగా సింగర్ సునీతపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చేసింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Singer Sunitha, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు