Drama Juniors: అదరగొడుతున్న డ్రామా జూనియర్స్.. జడ్జిలుగా రేణు దేశాయ్, సింగర్ సునీత!

drama juniors

Drama Juniors: బుల్లితెరపై ఎన్నో వినోదాలు పంచే కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. డ్రామా, రియాలిటీ, ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన ఎన్నో షోలో వస్తుండగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

  • Share this:
    Drama Juniors: బుల్లితెరపై ఎన్నో వినోదాలు పంచే కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. డ్రామా, రియాలిటీ, ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన ఎన్నో షోలో వస్తుండగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇదిలా ఉంటే జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ షో ద్వారా ఎంతోమంది కిడ్స్ తమ ప్రతిభను చాటి చూపుతున్నారు.

    జీ తెలుగులో ఇదివరకే డ్రామా జూనియర్స్ షో సీజన్ ప్రసారం కాగా.. మళ్లీ మరో డ్రామా జూనియర్స్ సీజన్‌తో ముందుకు రానున్నారు. డ్రామా జూనియర్స్ ది నెక్స్ట్ సూపర్ స్టార్ అంటూ తాజాగా ఈ షో ప్రోమో విడుదల కాగా అందులో యాంకర్ ప్రదీప్ మాచిరాజు షోను ప్రారంభించాడు. ఇక జడ్జీలుగా రేణు దేశాయ్, సింగర్ సునీత, డైరెక్టర్ ఎస్.వి. కృష్ణారెడ్డిలు పరిచయమయ్యారు.

    ఇక ఇందులో పాల్గొనే బుడతలు మాత్రం తమ టాలెంట్ తో బాగా ఆకట్టుకుంటారు. ఈ డ్రామా జూనియర్స్ లో కిడ్స్.. హాస్య, భావోద్వేగాలకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులు షాక్ అయ్యేలా తమ నటనను చూపిస్తారు. అంతేకాకుండా ఈ షోలో పాల్గొన్న కిడ్స్ వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటుంటారు. ఇక ఈ షో గురించి మాటల్లో చెప్పడం కంటే చూస్తేనే అర్థం అవుతుంది.

    ఇక ఈ ప్రోమోలో జడ్జీలుగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముగ్గురు ఎంట్రీతో బాగా ఆకట్టుకున్నారు. ఇక ఇందులో పాల్గొన్న బుడతల అల్లర్లు చూస్తే మాత్రం తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ షో ద్వారా పిల్లలు తాము చేసే సన్నివేశాల్లో చివర్లో కరోనా గురించి ప్రేక్షకులకు నీతిని చూపిస్తారు. ఈ షో ఏప్రిల్ 11న రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
    Published by:Navya Reddy
    First published: