Singer Sunitha: కరోనానే మమ్మల్ని కలిపింది.. ప్రేమ కథ చెప్పిన సింగర్ సునీత, రామ్

సింగర్ సునీత, రామ్ వీరపనేని (Singer Sunitha Ram Veerapaneni)

Singer Sunitha-Ram Veerapaneni: తాను పెళ్లికి సిద్ధంగా లేనని.. లాక్‌డౌన్‌లోనే ఏదో జరిగిందని సరదాగా చెప్పారు సింగర్ సునీత. మా పెళ్లి జరగడానికి కరోనా రావాల్సి వచ్చిందని చిరునవ్వు చిందించారు రామ్.

  • Share this:
    ప్ర‌ముఖ నేప‌ధ్య గాయ‌కురాలు సునీత ఇటీవ‌లే రెండో పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. మ్యాంగో మీడియా అధినేత రామ్‌ వీరపనేని సునీత వివాహం చేసుకున్నారు. జనవరి 9న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగిన వివాహ వేడుక‌లో ప‌లువురు ప్ర‌ముఖులు కూడా పాల్గొని వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న సింగర్.. ఇటు సినిమాల్లో కూడా మళ్లీ బిజీ అయిపోయారు. మరి వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ఇంట్లో వారిని ఎలా ఒప్పించారు? అనేవి ఇప్పటికీ చర్చనీయాంశాలే. ఐతే పెళ్లి తర్వాత తొలిసారి వీరిద్దరు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. యాంకర్ సుమ ఇంటర్వ్యూలో తమ ప్రేమ కథ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

    తాను పెళ్లికి సిద్ధంగా లేనని.. లాక్‌డౌన్‌లోనే ఏదో జరిగిందని సరదాగా చెప్పారు సింగర్ సునీత. మా పెళ్లి జరగడానికి కరోనా రావాల్సి వచ్చిందని చిరునవ్వు చిందించారు రామ్.

    ''వృత్తిపరంగా మేం అప్పుడప్పుడూ కలిసే వాళ్లం. నాతో మాట్లాడుతూ ఇంకేంటి అని అనేవారు. మొదట్లో అర్ధం కాలేదు. కానీ తర్వాత అర్ధమయింది. నేను ముందు పెళ్లికి సిద్ధంగా లేను. కానీ ఈ లాక్‌డౌన్‌లో ఏదో అయింది. మా పెళ్లి జరగడానికి కరోనా రావాల్సి వచ్చింది. మా జీవితం కరోనాకు ముందు.. కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. ఒకరోజు ఇంట్లో బంధువులం అందరం కలిశాం. ఆ సమయంలో వృత్తిపరంగానే రామ్ నాకు ఫోన్ కాల్ చేశారు. నీతో సీరియస్‌గా మాట్లాడాలని అన్నారు. ఇలాగే ఉంటావా..? పెళ్లి చేసుకోరా? అని నేనే అడిగాను. నిజంగా అడుగుతున్నావా..కావాలనే అడుగుతున్నావా? నేను ఎప్పటి నుంచో ప్రపోజ్ చేస్తున్న విషయం తెలియదా? అని అన్నాడు. ఆ తర్వాత కారులో డ్రైవ్‌కు వెళ్లాం. అక్కడ అన్నీ మాట్లాడుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అలా మా ఇంట్లో వారు కూడా ప్రోత్సహించడంతో అందరి ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నాం.'' అని సింగర్ సునీత పేర్కొన్నారు.


    ఇరు కుటుంబ సభ్యులు, మిత్రులు తప్ప ఎవరికీ తెలియకుండా.. నిశ్చితార్థం చేసుకుందామని అనుకున్నట్లు సునీత, రామ్ తెలిపారు. కానీ కొందరు తమ బంధువులు ఫొటోలు బయటకు లీక్ చేయడంతో, మళ్లీ అందరికీ చెప్పాల్సి వచ్చిందని వెల్లడిచారు. తమ ఎంగేజ్‌మెంట్ విషయం మా పిల్లలకు కూడా తెలియదన్నారు సునీత. ఈ కార్యక్రమంలో అనుకోకుండా జరిగిపోయిందని వివరణ ఇచ్చారు. కేవలం తనను ఒక్కదానినే కాదు.. ఫ్యామిలీ మొత్తం బాధ్యతలను రామ్ తీసుకున్నారని సింగర్ సునీత చెప్పారు. నిజంగా ఆయన చాలా గ్రేట్ అని ప్రశంసించారు. జీవితం చాలా చిన్నదని.. ఉన్నన్ని రోజులు సంతోషంగా గడపాలన్నదే తమ అభిమతని సింగర్ సునీత్, రామ్ తెలిపారు. సమాజంలో కొంత మంది నెగెటివ్ కామెంట్స్ వచ్చాయని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: