HOME »NEWS »MOVIE »singer sunitha about allu arjun arya 2 movie ringa ringa song mnj

Allu Arjun- Singer Sunitha: అల్లు అర్జున్ మూవీలోని ఆ పాటంటే సింగ‌ర్ సునీతకు ఎందుకు ఇష్టం లేదు..?

Allu Arjun- Singer Sunitha: అల్లు అర్జున్ మూవీలోని ఆ పాటంటే సింగ‌ర్ సునీతకు ఎందుకు ఇష్టం లేదు..?
సింగర్ సునీత అల్లు అర్జున్

తన గాత్రంతో ఎన్నో పాట‌ల‌కు ప్రాణం పోసిన గాయ‌కుల్లో సునీత(Singer Sunitha) ఒక‌రు. గాయ‌కురాలిగా టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకన్న సునీత‌.. స్పెష‌ల్ సాంగ్‌లు మాత్రం పెద్ద‌గా పాడ‌లేదు.

  • Share this:
    Allu Arjun- Singer Sunitha: తన గాత్రంతో ఎన్నో పాట‌ల‌కు ప్రాణం పోసిన గాయ‌కుల్లో సునీత ఒక‌రు. గాయ‌కురాలిగా టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకన్న సునీత‌.. స్పెష‌ల్ సాంగ్‌లు మాత్రం పెద్ద‌గా పాడ‌లేదు. వాటిని పాడ‌కూడ‌ద‌ని తాను ఏం నిబంధ‌న‌లు పెట్టుకోలేద‌ని.. కానీ త‌న గొంతుకు సెట్ అవ్వ‌వు అనుకుంటారో ఏమో గానీ త‌న‌కు ఏ సంగీత ద‌ర్శ‌కుడు ఆ అవ‌కాశాల‌ను ఇవ్వ‌లేద‌ని సునీత ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎందుకో తెలీదు గానీ త‌న‌కు ఆర్య 2లోని రింగ రింగ పాటను ఎవ‌రైనా పాడుతారు అంటే న‌చ్చ‌ద‌ని సునీత తెలిపారు. సింగింగ్ కాంపిటేష‌న్‌లో ఎవ‌రైనా పాడేందుకు ఆ పాట‌ను తీసుకున్నా తాను వ‌ద్ద‌ని చెబుతాన‌ని ఆమె అన్నారు. అలాగే జ‌డ్జిగా ఉన్న‌ప్పుడు చిన్న‌పిల్లలు ఆ పాట‌కు డ్యాన్స్ వేస్తామ‌న్నా నేను వ‌ద్ద‌ని చెప్పేదానన్ని సునీత పేర్కొన్నారు. ఎందుకో తెలీదు గానీ ఆ పాట‌ను ఎవ‌రైనా పాడుతా అన్నా, డ్యాన్స్ వేస్తామ‌న్నా ఎంక‌రేజ్ చేయ‌న‌ని చెప్పుకొచ్చారు.

    కాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన ఆర్య 2లోని రింగ రింగ పాట అప్ప‌ట్లో యూత్‌ను ఒక ఊపు ఊపింది. స్పెష‌ల్ సాంగ్ అయిన‌ప్ప‌టికీ.. ఈ పాట‌ను చాలా మంది ఇష్ట‌ప‌డ్డారు. మీనింగ్ ఎలా ఉన్నా.. ఆ పాట‌కు దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించిన‌ బీట్ చాలా మందికి న‌చ్చింది. దీంతో అప్ప‌ట్లో ఎక్క‌డ చూసిన ఈ పాట వినిపిస్తూ ఉండ‌గా.. ఎన్నో షోల‌లో కూడా ఈ హిట్ సాంగ్‌కి డ్యాన్స్‌లు వేశారు.



    అంతేకాదు బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌కి సైతం ఈ పాట తెగ న‌చ్చేయ‌గా.. త‌న రెడీ సినిమాలో రీమేక్ చేయించి మరీ పెట్టుకున్నారు. అలాగే ఒక ఐపీఎల్ మ్యాచ్ స‌మ‌యంలో కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ సైతం ఈ పాట‌కు స్టెప్పులు వేశారు.
    Published by:Manjula S
    First published:January 25, 2021, 12:32 IST