హోమ్ /వార్తలు /సినిమా /

SP Balu : గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీలో మరో విషాదం..

SP Balu : గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీలో మరో విషాదం..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (File/Photo)

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (File/Photo)

SP Balu : గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీలో మరో విషాదం చోటు చేసుకుంది.

  SP Balu : గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) ఫ్యామిలీలో మరో విషాదం చోటు చేసుకుంది. గతేడాది సెస్టెంబర్ 25న ఆయన కరోనాతో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన గతించి యేడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజా భర్త ప్రముఖ నటుడు శుభలేక సుధాకర్ (Shubhalekha Sudhakar) తల్లి ఎస్.ఎస్. కాంతం చెన్నైలో  కన్నుమూసారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం శుభలేఖ సుధాకర్ తండ్రి గారైన కృష్ణారావు కన్నుమూసారు. వీళ్లు చైన్నైలోని మహాలింగ పురంలో ఉండేవారు. రీసెంట్‌గా శుభలేఖ సుధాకర్ తల్లిగారు గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. వీటితో పాటు వృద్దాప్య సమస్యలతో పాటు ఏజ్ ఫ్యాక్టర్ తోడవడంతో ఆమె మంగళవారం కన్నుమూసారు.

  కృష్ణారావు, కాంతం దంపతులకు సుధాకర్ పెద్ద కుమారుడు. ఇక శుభలేఖ సినిమాతో పరిచయమైన సుధాకర్.. ఆ తర్వాత శుభలేఖ సుధాకర్‌గా మారారు. ఈయన అసలు పేరు సూరావజ్జుల సుధాకర్. ఈయన పెద్ద తమ్ముడు మురళీ దత్తు వైజాగ్‌లో ఉంటున్నారు. మూడో తమ్ముడు అట్లాంటలో స్థిర పడ్డారు. ఈ రోజు మధ్యాహ్నం చెనైలో సుధాకర్ తల్లి కాంతం గారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శుభలేఖ సుధాకర్ తల్లి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

  శుభలేఖ సుధాకర్ తల్లి కాంతం కన్నుమూత (File/Photo)

  శుభలేఖ సుధాకర్ విషయానికొస్తే.. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా  డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె భార్య ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం చెల్లెలు ఎస్పీ శైలజా కూడా గాయనిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు టబు, సోనాలి బింద్రే వంటి ఎంతో మంది నటీమణులకు డబ్బింగ్ చెప్పారు.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  2021లో చాలా మంది నటీనటులు కన్నుమూసారు. టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్, శాండిల్ వుడ్ అనే తేడా లేకుండా భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు కరోనాతో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నుమూసారు. ఇప్పటికే తమిళ కమెడియన్ వివేక్.. ఆ తర్వాత సీనియర్ నటుడు పొట్టి వీరయ్య..  దర్శకుడు సాయి బాలాజీ, దర్శకుడు కేవి ఆనంద్ వంటి వారు కన్నుమూసారు. అటు బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌తో పాటు అలనాటి కథానాయికగా జయంతి, ఆనంద్ కణ్ణన్‌తో పాటు చాలా మంది  ఈ యేడాదే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. నిన్నటి నిన్న హాలీవుడ్ నటుడు మైఖేల్ విలియమ్స్ కన్నుమూసారు.  తాజాగా శుభలేఖ సుధాకర్ తల్లి గారైన కాంతం కన్నుమూసారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: S. P. Balasubrahmanyam, Subhalekha Sudhakar, Tollywood

  ఉత్తమ కథలు