బాలీవుడ్‌లో ఇంకా ఆత్మహత్యలు చూస్తారంటున్న ప్రముఖ సింగర్..

Sonu Nigam: హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అర్ధాంతరంగా చనిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 19, 2020, 7:53 PM IST
బాలీవుడ్‌లో ఇంకా ఆత్మహత్యలు చూస్తారంటున్న ప్రముఖ సింగర్..
సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు (sonu nigam sushant singh rajput)
  • Share this:
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అర్ధాంతరంగా చనిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏదైనా కావచ్చు కానీ దారుణమైన నిర్ణయం మాత్రం తీసుకున్నాడు ఈయన. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్‌లో మరిన్ని ఆత్మహత్యలు ఖాయం అంటూ జోష్యం చెప్తున్నాడు సింగర్ సోనూ నిగమ్. ఈయన చెప్పిన మాటలు విన్న తర్వాత కచ్చితంగా అంతా షాక్ అవ్వక తప్పదు. బాలీవుడ్‌లో నెపోటిజం అంశం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది.

సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు (sonu nigam sushant singh rajput)
సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు (sonu nigam sushant singh rajput)


ఇన్ని రోజులు నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ విషయం ఒక్కసారిగా హైలైట్ అయిపోయింది. సుశాంత్ మరణం తర్వాత అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. బంధుప్రీతి కారణంగా చాలా మంది ఔట్ సైడర్స్ కనీసం లోపలికి కూడా రాలేకపోతున్నారని.. బాలీవుడ్‌ను వాళ్ల బాబుగారి సొత్తులా అంతా వాడేసుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు అభిమానులు. ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసాడు. త్వరలో మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా వరుస ఆత్మహత్యలు చూస్తారని ఆయన పేర్కొనడం తీవ్ర కలకలం రేపుతుంది.

సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు (sonu nigam sushant singh rajput)
సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు (sonu nigam sushant singh rajput)


కేవలం రెండు కంపెనీలు మాత్రమే బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తున్నాయని.. సినీ రంగం కంటే కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో పెద్ద మాఫియాలు ఉన్నాయంటూ ఆయన చెప్పడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు ఇవ్వకుండా వాళ్లను మానసికంగా వేధించడం.. కేవలం పెద్దింటి వాళ్లకు మాత్రమే అవకాశాలు వస్తున్నాయని విమర్శలు వస్తున్న తరుణంలో సోనూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మరి దీనిపై ఇప్పటికైనా బాలీవుడ్ పెద్దలు స్పందిస్తారా లేదా అనేది చూడాలిక.

First published: June 19, 2020, 6:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading