ఇష్టం లేకపోయినా చేశాను.. అసలు విషయం చెప్పిన స్మిత

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పరుచుకున్నారు సింగర్ స్మిత. అలాంటి స్మిత అప్పట్లో 'మల్లీశ్వరి' సినిమాలో డీగ్లామర్‌గా కనిపించే పనిమనిషి పాత్రలో కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

news18-telugu
Updated: July 23, 2019, 3:49 PM IST
ఇష్టం లేకపోయినా చేశాను.. అసలు విషయం చెప్పిన స్మిత
సింగర్ స్మిత(Image : Facebook)
news18-telugu
Updated: July 23, 2019, 3:49 PM IST
సింగర్‌గా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు స్మిత. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పరుచుకున్నారు. అలాంటి స్మిత అప్పట్లో 'మల్లీశ్వరి' సినిమాలో డీగ్లామర్‌గా కనిపించే పనిమనిషి పాత్రలో కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.ఇదే విషయంపై తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె అసలు విషయం చెప్పారు. నిజానికి ఆ పాత్ర చేయడం తనకు ఇష్టం లేదన్నారు.అప్పటికి చాలానే సినిమా ఆఫర్స్ వచ్చినా తిరస్కరించానని చెప్పారు. అయితే మల్లీశ్వరి సినిమాలో అవకాశం వచ్చినప్పుడు సన్నిహితులంతా చేయమన్నారని.. అందుకే ఒప్పుకున్నానని అన్నారు.ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఆ పాత్ర చేయడం అవసరమా? అని పదేపదే అనుకునేదాన్ని అని తెలిపారు. అయితే షూటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బాగా చూసుకున్నారని.. అందుకే ఆ పాత్ర చేశానని తెలిపారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ నటన వైపు వెళ్లాలన్న ఆలోచన రాలేదని.. అందుకే ఏ సినిమా ఒప్పుకోలేదని తెలిపారు.

First published: July 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...