Home /News /movies /

SINGER SMITHA HELPS HUGE AMOUNT FOR TELUGU LYRICIST KANDIKONDA SURGERY HERE ARE THE DETAILS SR

Kandikonda | Smitha : సినీ రచయిత కందికొండకు అండగా నిలిచిన సింగర్ స్మిత..

Kandikonda and Smitha Photo : Twitter

Kandikonda and Smitha Photo : Twitter

Kandikonda | Smitha : ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కందికొండ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్  హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

    ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ   (Kandikonda )అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కందికొండ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్  హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కందికొండ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన్మించారు. అనేక ఒడిదొడుకులను దాటి ఉస్మానియా యూనివర్సీటీలో ఉన్నత చదువులను అభ్యసించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగల విశిష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలని రాశారు కందికొండ. అంతేకాదు పూరి జగన్నాథ్ దర్శకత్వలో వచ్చిన అల్లు అర్జున్ `దేశముదురు`, మహేష్ బాబు `పోకిరి`, ప్రభాస్ `మున్నా`, రవితేజ `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` వంటి ఎన్నో హిట్ చిత్రాలకు పాటలు అందించారు.

    ప్రస్తుతం పెరాలసిస్ తో బాధపడుతున్నారు కందికొండ. దీనికి తోడు క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం కీమో థెరపీ చేయించుకోవడంతో.. కందికొండ స్పైనల్‌కార్డ్‌ లోని సీ1 సీ2 భాగాలు దెబ్బతిన్నాయట. దీంతో కందికొండ నడవలేని స్థితి. తొందరగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని కందికొండను పరీక్షించిన డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే చికిత్స కోసం 26 లక్షలు ఖర్చు పెట్టారు కందికొండ కుటుంబ సభ్యులు.

    Rajinikanth : హాస్పిటల్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్.. కారణమిదే..

    కందికొండ ఆరోగ్యం ప్రస్తుతం మరింత క్షిణించడంతో... ఆర్థికంగా ఆదుకోవాలనీ ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చికిత్స కోసం లక్షల్లో ఖర్చు అవుతోందని.. దాతలు తమ వంతుగా వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కాగా ఆయనకు వెన్ను భాగంలో సర్జరీ జరగనున్న నేపథ్యంలో.. డబ్బు అవసరం ఉంది.

    ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సింగర్ స్మిత   (Singer Smitha) సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కందికొండ శస్త్ర చికిత్స కోసం అయ్యే ఖర్చులో భారీ మొత్తంలో ఆమె వైపు నుంచి సాయం చేసినట్టు సమాచారం. స్మిత కరోనా సమయంలో కూడా అభాగ్యులకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలను చేపట్టి పెద్ద మనసు చాటుకున్నారు.

    KCR Biopic: కేసీఆర్ బయోపిక్ విడుదల తేదీ ఖరారు.. వివరాలివే..

    కందికొండను కాపాడుకుందాం అంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రయత్నిస్తున్నారు. కందికొండ చికిత్సకు ఆర్థికంగా కావాల్సిన సాయం చేయాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కోన వెంకట్ నిర్మాత, రచయిత వంటి ప్రముఖులు కందికొండకు సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

    సహాయం చేయాలనుకునేవారు..
    ఈ ఫోన్‌ నంబర్‌కు గూగుల్‌ పే
    చేయొచ్చు: 81793 10687
    బ్యాంక్‌ ఖాతా: ఆంధ్రాబ్యాంక్‌,
    కందికొండ రమాదేవి, అకౌంట్‌
    నంబర్‌: 135510100174728.
    ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ANDB0001355

    ఇక గతంలో కందికొండ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఆయన ఆస్పత్రి చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు. కందికొండ గత కొన్ని రోజులుగా త్రోట్ క్యాన్సర్‌తో బాదపడుతున్నారు. దీంతో చికిత్సలో భాగంగా రోజూ రూ.70వేలకుపైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Singer smitha, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు