SINGER SMITA DONATES MEALS TO POOR PEOPLE FOR HELP OF CYBERABAD POLICE TA
సైబరాబాద్ సీపీ సజ్జనార్ సాయంతో అన్నార్తులను ఆదుకున్న సింగర్ స్మిత..
సైబరాబాద్ సీపీతో గాయని స్మిత (Twitter/Photo)
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాాజాగా పాపులర్ తెలుగు పాప్ సింగర్ స్మిత ప్రస్తుత సంక్షోభ కాలంలో నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ నివారణ కోసం కేంద్రం 21 రోజుల పాటు మొదటిసారి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. కేసులు ఇంకా తగ్గకపోవడంతో మరో 19 రోజులు లాక్డౌన్ పొడిగించారు. ఇప్పటికే కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేస్తున్నారు. వీరికి సినీ నటులు కూడా అండగా నిలుస్తున్నారు.ఇప్పటికే చాలా మంది సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. అంతేకాదు కరోనా మహామ్మారిపై సినీ నటులు తమ వంతుగా అవగాహాన కల్పిస్తున్నారు. మరికొందరు తమకు తోచిన సహయం అందిస్తున్నారు. తాాజాగా పాపులర్ తెలుగు పాప్ సింగర్ స్మిత ప్రస్తుత సంక్షోభ కాలంలో నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ బృందం సహకారంతో ఆమె ఇప్పటివరకూ 82,360 మందికి అన్నార్తుల ఆకలిని తీర్చారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ సాయంలో ఆమె సైబరాబాద్ పోలీసులు సహకరించారు. ఈ సందర్భంగా స్మిత మాట్లాడుతూ.. సజ్జనార్ సర్.. నేను చేస్తోన్న చిరు సాయానికి మీరు అందించిన సహకారం మరవలేనిది అంటూ చెప్పుకొచ్చింది. గత 30 రోజులుగా మీ బృందంతో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మీ టీమ్ ద్వారా ఇప్పటివరకూ 83360 మందికి భోజనం పెట్టాం. ఇప్పుడు మీ సూచన మేరకు నిత్యావసరాలను అందించే పని ప్రారంభిస్తున్నాం. ఈ సంక్షోభ కాలంలో నాకు సాధ్యమైనంతలో సాయం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.