Ranu Mondal : దుర్గాపూజపై రణు మండల్ సాంగ్... ఎంత బాగా పాడిందో...

Ranu Mondal Durga Puja Song : సోషల్ మీడియా సెన్సేషన్ రణు మండల్... తొలిసారిగా దుర్గాపూజపై సాంగ్ పాడారు. యాజ్‌యూజువల్‌గా అది వైరల్ అయ్యింది.

Krishna Kumar N | news18-telugu
Updated: October 1, 2019, 1:11 PM IST
Ranu Mondal : దుర్గాపూజపై రణు మండల్ సాంగ్... ఎంత బాగా పాడిందో...
రణు మండల్ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: October 1, 2019, 1:11 PM IST
Ranu Mondal Durga Puja Song : సోషల్ మీడియా సెన్సేషన్ రణు మండల్ పాడిన తేరీ మేరీ కహానీ సాంగ్ ఎంతలా వైరల్ అయ్యిందో... దుర్గా పూజపై ఆమె పాడిన మరో పాట కూడా అలాగే వైరల్ అవుతోంది. కోల్‌కతాలో... దూర్గా పూజ ఎంత బాగా చేస్తారో మనకు తెలుసు. ఆ సందర్భంగా... బెంగాలీ సాంగ్‌ను ఆమె పాడటం విశేషం. ఈ సాంగ్‌తో ఆమె ప్లే బ్యాక్ సింగర్ కూడా అయ్యారు. తేరీ మేరీ తర్వాత ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్ హిమేష్ రేష్మియా సమక్షంలో ఆమె మరో మూడు పాటలు పాడారు. అన్నీ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఆమె పాడే ప్రతీ పాటా వైరల్ అవ్వడం కామనైపోయింది. ముంబైలోని రాణాఘాట్ రైల్వేస్టేషన్‌లో పాటలు పాడుకుంటూ బిక్షాటన చేసుకునే ఓ మహిళ... ఈ స్థాయిలో దేశం మొత్తం అభిమానులను సంపాదించుకోవడం విశేషమే మరి.


తాజాగా రణు మండల్ పాడిన బెంగాలీ పాటను ప్రితమ్ దేవ్ రాశారు. బెంగాలీలు దూర్గా పూజను ఎలా జరుపుకుంటారో ఈ సాంగ్‌లో చూపించారు. మీకు తెలిసే ఉంటుంది... ఇప్పుడు రణు మండల్ జీవితంపై ఓ బయోపిక్ కూడా రాబోతోంది. డైరెక్టర్ రిషికేషే మండల్... ఈ సినిమా తియ్యబోతున్నారు. నటి సుదీప్తా చక్రవర్తి... రణు మండల్ పాత్రను చేసే అవకాశం ఉంది. ఇంకా స్క్రిఫ్ట్ తన దగ్గరకు రాలేదన్న ఆమె... దాన్ని చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు.






 
Loading...



View this post on Instagram




 

My creative instinct said that for this Classic Romantic track Keh Rahi Hai Nazdeekiyaan from my forthcoming film Happy Hardy and Heer, I should collaborate with the most talented, unique and unconventional talents of the industry. Legendary, Divine and Majestic - featuring Udit Narayan, Ranu Mondal, Paayal Dev and Himesh Reshammiya. Expect the unexpected on this most auspicious day for the Indian Music Industry, Our Dearest Lata Ji’s Birthday. Lots of Love and Thanks again for all your support.


A post shared by Himesh Reshammiya (@realhimesh) on





రణు మండల్... రైల్వేస్టేషన్‌లో పాటలు పాడుతూ ఉండటాన్ని యతీంద్ర చక్రవర్తి చూశారు. ఓ రోజు ఆమె పాడిన "ప్యార్ కా నగ్మా" పాటను వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె వాయిస్... ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ వాయిస్‌లా ఉందని నెటిజన్లు మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఓ రియాల్టీ షో నిర్వాహకులు ఆమెను పిలిచి పాటలు పాడించుకున్నారు. అదే సమయంలో... హిమేష్ రేష్మియా ఆమెను పిలిచి... తేరే మేరీ కహానీ పాడించారు. ఆ పాటతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.



రేడియో, టేప్ రికార్డర్‌లో లతా మంగేష్కర్ పాటలు వింటూ... పాటలు పాడటం నేర్చుకున్నానన్న రణు మండల్... యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఓ క్లబ్‌లో పాడేదాన్నని తెలిపారు. మ్యారేజ్ తర్వాత... మామగారు అభ్యంతరం చెప్పడంతో అక్కడ పాడటం మానేశానని తెలిపారు. మొత్తంగా మరోసారి ఆమె తాజా ప్లే బ్యాక్ సాంగ్‌తో టాఫ్ ఆఫ్ ది ఇండియా అయ్యారు.
First published: October 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...