Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: June 16, 2019, 12:35 PM IST
సింగర్ చిన్మయి శ్రీపాద Photo: Instagram/chinmayisripaada
ఏడాదిన్నరగా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న చీడపురుగు పేరు మీటూ.. ఈ ఉద్యమంలో చాలా మంది సెలెబ్రిటీస్ వచ్చి తమకు జరిగిన అన్యాయాలను కెమెరా ముందు చెప్పారు. అందులో సింగర్ చిన్మయి కూడా ఉంది. ఈమె కూడా తనతో కొందరు సంగీత దర్శకులతో పాటు, వైరముత్తు లాంటి లెజెండరీ లిరిక్ రైటర్స్ కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ సంచలన ఆరోపణలు చేసింది చిన్మయి. ఇక ఈమె కొన్ని రోజుల కింద కన్నడ సంగీత దర్శకుడు, గాయకుడు రఘు దీక్షిత్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.

చిన్మయి రఘు దీక్షిత్
ఓసారి తనకు ఆఫర్ ఇస్తానని చెప్పి ఇంటికి రమ్మన్నాడని సంచలన ఆరోపణలు చేసింది చిన్మయి. అప్పట్లో అవి వైరల్ అయ్యాయి కూడా. ఇక చిన్మయి ఆరోపణలు చేసిన రోజు నుంచి రఘు ఇంట్లో గొడవలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు అవి ముదిరి పాకాన పడిపోయాయి. చిన్మయి స్నేహితురాలితో కూడా రఘు అసభ్యంగా ప్రవర్తించాడనే వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ఆయన కూడా ఒప్పుకున్నాడు.

చిన్మయి రఘు దీక్షిత్
అద్భుతంగా పాట పాడినందుకు రికార్డింగ్ స్టూడియోలో ఆ గాయకురాలిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించానని చెప్పాడు రఘు దీక్షిత్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇష్యూ ముదిరి ముదిరి ఇప్పుడు విడాకుల వరకు వచ్చింది. ఎంత సర్దిచెప్పడానికి చూసినా కూడా వినకపోవడంతో విడిపోవడమే బెటర్ అని బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. మొత్తానికి చిన్మయి దెబ్బకు రఘు దీక్షిత్ కాపురం కొల్లేరు అయిపోయింది.
Published by:
Praveen Kumar Vadla
First published:
June 16, 2019, 12:35 PM IST