నిషేధం తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన సింగర్.. రాగానే ఏం చేశాడో తెలుసా?

Singer Mika Singh : భారత్‌లో అడుగుపెడుతూనే 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు సింగర్ మైకా సింగ్. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

news18-telugu
Updated: August 16, 2019, 11:57 AM IST
నిషేధం తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన సింగర్.. రాగానే ఏం చేశాడో తెలుసా?
సింగర్ మైకా సింగ్
  • Share this:
కశ్మీర్‌పై భారత నిర్ణయాన్ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తున్నవేళ లాహోర్‌లో ఈవెంట్ చేయడానికి వెళ్లి ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్(AICWA)చేత
నిషేధానికి గురైన సింగర్ మైకా సింగ్ భారత్‌లో అడుగుపెట్టారు. భారత్‌లో అడుగుపెడుతూనే 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన మైకా సింగ్.. జవాన్లకు సెల్యూట్ చెప్పారు. జవాన్లు ఏ పండుగను సెలబ్రేట్ చేసుకోలేని స్థితిలో ఉన్నారని.. మన జీవితాలు బాగుండటం కోసం వారు తమ వ్యక్తిగత జీవితాలు కూడా త్యాగం చేస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కాగా, కశ్మీర్‌‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచినా పాక్ మాత్రం వ్యతిరేకతను చాటుకున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ విషయంలో భారత్ నిర్ణయం అంతర్గత వ్యవహారమని చెప్పినా.. పాక్ వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సింగర్ మైకా సింగ్ పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సమీప బంధువు ఇంట్లో జరిగిన ఓ వేడుకలో ప్రదర్శన ఇచ్చేందుకు అక్కడికి వెళ్లాడు. దేశమంతా పాకిస్తాన్‌పై రగిలిపోతున్నవేళ.. మైకాసింగ్ అక్కడికి వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. దీంతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆయనపై నిషేధం విధించింది. మైకా సింగ్‌తో ఎవరైనా సినిమాలు చేస్తే.. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు