హోమ్ /వార్తలు /సినిమా /

Sudigali Sudheer: సుధీర్‌ని దద్దోజనం అంటూ కామెంట్.. శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్లీ అవమానం?

Sudigali Sudheer: సుధీర్‌ని దద్దోజనం అంటూ కామెంట్.. శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్లీ అవమానం?

Sudigali Sudheer

Sudigali Sudheer

Sudigali Sudheer: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం గత ఎనిమిది సంవత్సరాల నుంచి విజయవంతగా దూసుకుపోతుంది

  Sudigali Sudheer: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం గత ఎనిమిది సంవత్సరాల నుంచి విజయవంతగా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మల్లెమాల సంస్థ వారు ఈటీవీలో "శ్రీదేవి డ్రామా కంపెనీ" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా జబర్దస్త్ కమెడియన్లు ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది, ఇమ్మానియేల్ వంటి జబర్దస్త్ కమెడియన్లు అదిరిపోయే పంచ్ డైలాగులతో ఎంతో సరదాను పంచుతున్న సంగతి తెలిసిందే.

  శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కమెడియన్స్ చేసే స్కిట్లు కొన్ని సార్లు వివాదాలకు కూడా కారణం ఉంటాయి. ఇకపోతే ఈ కార్యక్రమానికి యాంకర్ గా సుడిగాలి సుదీర్ వ్యవహరించడం ఈ కార్యక్రమానికి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. తాజాగా ఆగస్టు 8వ తేదీ ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఈ ప్రోమోలో భాగంగా కమెడియన్లు అద్భుతమైన పంచ్ డైలాగులు ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. అదేవిధంగా ఈ ప్రోమోలి గెటప్ శీను మెగాస్టార్ చిరంజీవి గురించి అద్భుతంగా పర్ఫామెన్స్ చేశారు. కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎందరో ప్రాణాలను కాపాడారని కరోనా సమయంలో మెగాస్టార్, సోను సూద్ వంటి వారు చేసిన సేవలను కొనియాడారు.

  ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మను గారితో హైపర్ ఆది అద్భుతమైన కామెడీని పండించారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ ప్రళయం వస్తే ఇల్లులు పడిపోతాయి అంటూ హైపర్ఆది అనగా.. అందుకు మను ఇల్లులు కాక ఇండస్ట్రీ పడిపోతుందా అంటూ కౌంటర్ వేశారు. ఆ తర్వాత మను మాట్లాడుతూ.. లోపలికి వెళ్లి దేవుడికి సుధీర్ ను పెట్టొస్తా.. అని అనగా అందుకు హైపర్ ఆది దేవుడికి సుధీర్ ఏంటి సార్.. అని అనగా అందుకు మను అదే దద్దోజనం పెట్టొస్తా.. అంటూ కామెంట్ చేయడంతో అక్కడున్న వారందరూ పగలబడి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Hyper Aadi, Singer manoj, Sridevi drama company, Sudigali sudheer, Tollywood

  ఉత్తమ కథలు