Home /News /movies /

SINGER MANO TWO SONS AS HEROES HERE ARE THE DETAILS TA

Singer Mano : సింగర్ మనో ఇద్దరు కుమారులు హీరోలన్న సంగతి తెలుసా..

సింగర్ మనో (Youtube/Credit)

సింగర్ మనో (Youtube/Credit)

Singer Mano : సింగర్ మనో కుమారులు హీరోలన్న సంగతి తెలుసా.. తాజాగా సింగర్ మనో ఆలీతో సరదగా కార్యక్రమంలో తన సతీమణి జమీలా కలిసి ఈ షోలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

  Singer Mano : సింగర్ మనో కుమారులు హీరోలన్న సంగతి తెలుసా.. తాజాగా సింగర్ మనో ఆలీతో సరదగా కార్యక్రమంలో తన సతీమణి జమీలా కలిసి ఈ షోలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక సింగర్ మనో (Singer Mano) గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం సింగర్‌గానే కాదు.. ప్రస్తుతం ఈయన జబర్ధస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show) కు జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గతంతో  పలు సంగీత సంబంధ ప్రోగ్రామ్‌లకు కూడా జడ్జ్‌గా వ్యవహరించారు. అంతేకాదు.. ఈయన నటుడుతో పాటు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తాజాగా ఈయన ఎస్పీ బాలు, రజీనీకాంత్‌తో పాటు తన కుమారుల గురించి పలు విషయాలను పంచుకున్నారు.మనో గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. మనో  అసలు పేరు నాగూర్ బాబు. కొన్ని సినమాల్లో ఈయన పేరు నాగూర్ బాబుగానే టైటిల్స్‌లో ఉండేది.

  ఆ తర్వాత మనోగా మార్చుకున్నారు. ఈయన గాయకుడు కాకముందు చక్రవర్తి దగ్గర సహాయకుడిగా పనిచేసారు. అంతేకాదు దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాల్లో దాదాపు 25  వేలకు (25140) పైగా పాడారు. ఇక వివిధ సందర్భాల్లో మరో 25 వేలకు పైగా పాటలను ఆలపించారు.  తెలుగుతో పాటు తమిళం,  కన్నడ, బెంగాలీ సహా 11  పైగా భాషల్లో ఈయన పాటలు పాడారు. అంతేకాదు నటుడిగా ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఈయన గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  మనో స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌‌లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి.  ఈయనది సంప్రదాయ ముస్లిమ్ కుటుంబం. మనో తండ్రి పేరు రసూల్. తల్లి పేరు షహీదా. మనో గారి తండ్రి ఆలిండియా రేడియోలో పనిచేసేవారు. మనో చిన్నప్పటి నుంచే సంగీతం మక్కువ ఎక్కువ. ఈయనలోని టాలెంట్‌ను పసిగట్టిన తండ్రి ఈయన్ని ప్రముఖ సంగీత విద్వాంసులు నేదునూరు కృష్ణమూర్తి దగ్గర చేర్పించారు. అక్కడే మనో సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు.

  Rajinikanth - Mano: రజినీకాంత్‌కు మనో మొదటిసారి డబ్బింగ్ చెప్పిన సినిమా ఏంటో తెలుసా..

  కెరీర్ మొదట్లో ఇళయరాజా ఎక్కువగా  మనోతో పాటలు పాడించేవారు. అంతేకాదు నాగూరు బాబును మనోగా మార్చింది ఇళయరాజానే. అంతేకాదు మనోను చక్రవర్తి దగ్గర శిష్యుడిగా చేర్పించింది కూడా ఇళయరాజానే కావడం విశేషం. ఇక మనో తేనేలూరే గొంతు విన్న చక్రవర్తి ఆయనకు అసిస్టెంట్‌గా నియమించుకున్నారు.ఇక నాగూర్ బాబు అదేనండి మనో పలు సినిమాల్లో నటించారు. మహేష్ బాబు తొలి చిత్రం ‘నీడ’లో నటించారు.

  మనో ఇద్దరు కుమారులు (Twitter/Photo)


  సింగర్‌గా మురళీ మోహన్ నటించిన ’కర్పూర దీపం’తో గాయకుడిగా ప్రస్థానం మొదలు పెట్టారు. ఈయనకు జమీలాతో 19 ఏళ్ల వయసులో 1985లో  పెళ్లైంది. అయితే వీరి పెళ్లికి సంగీత దర్శకులు ఇళయరాజా, చక్రవర్తి సాక్షి సంతకాలు చేయడం విశేషం. అయితే మనో సంగీతంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. సింగర్ మనోకు ముగ్గురు కుమారులు, ఒక అమ్మాయి. ఒక అబ్బాయి.. నాలుగేళ్ల వయసులో ప్రమాదవ శాత్తు కన్నుమూసారు.

  Ashwini Dutt - K Raghavendra Rao : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, దర్శకుడు కే రాఘవేంద్రరావు టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్..


  ఇక మనో పెద్ద కుమారుడు షకీరా తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక రెండవ కుమారులు రతేష్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అమ్మాయి సోపికా అమెరికాలో స్వరాభిషేకంలో తన గళాన్ని వినిపిస్తోంది. త్వరలో సినిమా సింగర్‌గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందట. ముస్లిమ్ కుటుంబానికి చెందిన మనోకు హిందూ సంప్రదాయ పట్ల ఎంతో గౌరవం ఉంది. ఆయన ఎన్నో హిందూ దేవాలయాలను సందర్శించారు.

  Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

  అంతేకాదు తిరుపతికి పలుమార్లు కాలినడక  వెళ్లిన సందర్భాలున్నాయి. కరోనా కారణంగా మనో కుమారులు నటించిన సినిమాలు విడుదల కాలేకపోయాయి. త్వరలో ఆ సినిమాలు రిలీజ్ కానున్నట్టు చెప్పారు. ఇక మనో భార్య జమీలాకు ఒకే ఒక్క కోరిక ఉందట. తన భర్తకు ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డు వస్తే సంతోషిస్తానని చెప్పుకొచ్చారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Singer Mano, Tollywood

  తదుపరి వార్తలు