SP Balasubrahmanyam Mano: ఎస్పీ బాలును తలుచుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చిన సింగర్ మనో..

SP Balasubrahmanyam Mano: ఎస్పీ బాలసుబ్రమణ్యం అనేది పేరు కాదు.. అదో ఎమోషన్. ఎన్నో కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయిన పేరు.. చిరస్థాయిగా చెరిగిపోని గుర్తు. పాట ఉన్నంత కాలం అందరి మనసులో వినిపించే మంత్రం ఎస్పీ బాలు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 25, 2020, 10:25 PM IST
SP Balasubrahmanyam Mano: ఎస్పీ బాలును తలుచుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చిన సింగర్ మనో..
ఎస్పీ బాలు మనో (sp balu singer mano)
  • Share this:
ఎస్పీ బాలసుబ్రమణ్యం అనేది పేరు కాదు.. అదో ఎమోషన్. ఎన్నో కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయిన పేరు.. చిరస్థాయిగా చెరిగిపోని గుర్తు. పాట ఉన్నంత కాలం అందరి మనసులో వినిపించే మంత్రం ఎస్పీ బాలు. అంతటి ముద్ర వేసిన మధుర గాయకుడు అమర గాయకుడు అయిపోవడంతో బాలుతో అనుబంధం ఉన్న ఎందరో సంగీత ప్రియులు ఇప్పటికీ మౌనంగా రోదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు గాయకుడు మనో కూడా ఇదే చేసాడు. బాలసుబ్రమణ్యంతో ఈయనది 35 ఏళ్ల అనుబంధం. మనో సింగర్ కాక ముందు నుంచి కూడా బాలుతో పరిచయం ఉంది. అసలు మనో సింగర్‌గా మారడానికి కారణం కూడా బాలునే. సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర పని చేస్తున్న సమయంలో ఆయన్ని ఇళయరాజాకు పరిచయం చేసి.. అతడితో పాటలు పాడించేలా ప్రోత్సహించాడు బాలు. అంతేకాదు మనో పెళ్లి జరగడానికి కారణం కూడా బాలసుబ్రమణ్యమే. ఎందుకంటే తనకు పిల్లను ఎవ్వరూ ఇవ్వరు అనుకుంటున్న తరుణంలో సాక్షి సంతకం పెట్టి.. తన పెళ్లికి గ్యారెంటీగా బాలు ఉన్నాడని ఎన్నోసార్లు చెప్పాడు మనో.
ఎస్పీ బాలు మనో (sp balu singer mano)
ఎస్పీ బాలు మనో (sp balu singer mano)


ఇప్పుడు దసరా సందర్భంగా ఈటీవీలో స్పెషల్ ఈవెంట్ చేసారు. అందులో #SPBLivesOn అంటూ ప్రోగ్రామ్ చేసారు. అందులో మనోతో పాటు సింగర్ ఉష కూడా ఎస్పీ బాలు పాడిన పాటలు ఆలపించారు. అయితే ఆ పాటలు పాడుతున్న సమయంలోనే బాలును గుర్తు చేసుకుని కుప్పకూలిపోయాడు మనో. తనతో ఆయనకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదని.. బాలు మరణం ఎప్పటికీ జీర్ణించుకోలేని విషయమే అంటూ కన్నీరుమున్నీరు అయ్యాడు మనో.
ఎస్పీ బాలు మనో (sp balu singer mano)
ఎస్పీ బాలు మనో (sp balu singer mano)

తన జీవితంలో జరిగిన ప్రతీ సంఘటనను గుర్తు చేసుకుని.. అన్నింటి వెనకాల బాలు గారు ఉన్నారంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేసాడు మనో. ఆయన మాత్రమే కాదు.. అక్కడే ఉన్న సింగర్ ఉష, హీరోయిన్ సంగీత, సుడిగాలి సుధీర్, శేఖర్ మాస్టర్, రష్మి గౌతమ్.. ఇలా సెట్‌లో ఉన్న వాళ్లంతా కన్నీరు పెట్టుకున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: October 25, 2020, 10:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading