హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam-Malavika : బాల సుబ్రమణ్యంకు నా వల్ల కరోనా రాలేదు : సింగర్ మాళవిక..

SP Balasubrahmanyam-Malavika : బాల సుబ్రమణ్యంకు నా వల్ల కరోనా రాలేదు : సింగర్ మాళవిక..

మాళవిక, బాలు Photo : Facebook

మాళవిక, బాలు Photo : Facebook

SP Balasubrahmanyam-Malavika : సింగర్ మాళవిక కారణంగా ప్రముఖ సింగర్ బాలసుబ్రమణ్యంకు కరోనా సోకిందని కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో మాళవిక వివరణ ఇచ్చింది.

  సింగర్ మాళవిక కారణంగా ప్రముఖ సింగర్ బాలసుబ్రమణ్యంకు కరోనా సోకిందని కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో మాళవిక వివరణ ఇచ్చింది. తన ఫేసు‌బుక్ పేజీలో రాస్తూ... రామోజీ ఫిలిం సిటీలో జూలై 30,31 తేదీలలో ఎస్పీబీ స్పెషల్ ఎపిసోడ్స్ జరిగాయని.. జూలై 30న చాలా మంది సింగర్స్ పాల్గొన్నారు.. తాను మాత్రం 31 పార్టిసిపేట్ చేశానని పేర్కోంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాళవిక అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళానని తెలిపింది. ఆగస్ట్ 5న బాలుగారు కరోనా సోకినట్టు వీడియో ద్వారా తెలిపారు. అయితే ఆ షోలో పాల్గొన్నాం కాబట్టి  టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని ఆగస్ట్ 8న రిపోర్ట్ వచ్చిందని.. తాను జూలై 31 షూటింగ్‌లో పాల్గోన్నానని.. . అంతకు ముందు తనకు కరోనా వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. తన ఇంట్లో పెద్ద వాళ్లు..  5 నెలల పాప ఉందని.. దీంతో ఎంతో జాగ్రత్తగా వారిని చూసుకుంటూ 5 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాం అని తెలిపింది. అయిదు నెలల తర్వాత షోకి వెళ్లానని.. అయితే లక్షణాలు లేకున్నా.. అనుమానం వచ్చి టెస్ట్ చేయిస్తే పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని..  తనకు రావడంతో అమ్మ,నాన్న, పాపకి టెస్ట్ చేయిస్తే.. వారికి వచ్చిందని.. ప్రస్తుతం వారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కోంది.

  మేం కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ పరిస్థితుల్లో దయచేసి నాపై అనవసర దుష్ప్రచారం చేయోద్దు.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది మాళవిక. అంతేకాకుండా తనను దోషిగా నిలబెడుతూ, తన గురించి తప్పుడగా ప్రచారం చేసే వాళ్ళ వివరాలు సేకరించి సైబర్ క్రైమ్‌కి రిపోర్ట్ చేస్తానని పేర్కోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: SP Balasubrahmanyam, Tollywood news

  ఉత్తమ కథలు