SINGER LATA MANGESHKAR HEALTH DETERIORATES NOBODY ALLOWED TO MEET HER SR
Lata Mangeshkar : క్షీణించిన లతా మంగేష్కర్ ఆరోగ్యం.. అందోళనలో అభిమానులు...
లతా మంగేష్కర్ Photo : Twitter
Lata Mangeshkar : లెజెండరీ సింగర్ భారత రత్న లతా మంగేష్కర్ (92) ఇటీవల కోవిడ్ (Covid -19) బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో హాస్పిటల్లో చేరిన ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.
Lata Mangeshkar : లెజెండరీ సింగర్ భారత రత్న లతా మంగేష్కర్ (92)ఇటీవల కోవిడ్ (Covid -19) బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో హాస్పిటల్లో చేరిన ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది. లతా మంగేష్కర్‌కు కోవిడ్‌తో పాటు న్యుమోనియా కూడా వచ్చిందని తెలుస్తోంది. దీంతో ఆమెను ఎవరు కలవనివ్వడం లేదు వైద్యులు. ఇక ఈ విషయం తెలుసుకున్న లతా మంగేష్కర్ అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం లతా మంగేష్కర్ తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోలుకుని ఇంటికి వెళ్లారు. కోవిడ్‌తో పాటు లతాజీ శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే.. లతామంగేష్కర్ ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1948 నుంచి 1978 వరకు 50వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గీన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకుంది. ఈమె గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకుంది. , 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న, వంటి పురాస్కారాలతో భారత ప్రభుత్వం లతా మంగేష్కర్ ను సత్కరించింది.
ఇప్పటికీ లతా జీ పాటలకు ఎంతో పేరుంది.. క్రేజ్ ఉంది.. ఆమె లాంటి గాయని మరొకరు లేరు రారు అంటూ చాలా మంది ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. ప్రస్తుతం ఈమెకు 92 ఏళ్లు. వయోభారంతో కొన్నేళ్లుగా పాటలు పాడటం లేదు లత మంగేష్కర్. ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు అభిమానులు.
ఎన్నో అద్భుత గీతాలకు తన స్వరంతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన లతా మంగేష్కర్...1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించింది. తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతిలకు మొదటి సంతానం ఆమె. మాటలే వచ్చేవయసునుండే పాటలను నేర్చిందీ ఈ గానకోకిల. చిన్నప్పుడే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు అమన్ అలీ ఖాన్, అమానత్ అలీ ఖాన్ శిష్యరికం చేసింది.. 13 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో అప్పటినుండే కుటుంబ పోషణా భారం లతాజీపై పడింది.
హిందీ చిత్రసీమలో ప్రముఖ సంగీత దర్శకులందరితో పాట పాడిన ఘనత ఆమె సొంతం. ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ వంటి అగ్ర సంగీత దర్శకులందరితో కలిసి లెక్కలేనన్ని పాటలు పాడారు లతా మంగేష్కర్.లతా మంగేష్కర్ మొదటి సారిగా మరాఠి మూవీలో పాడారు. అయితే ఈ మూవీ విడుదలయ్యే సమయానికి ఆమె పాటను తొలగించారు. లతాజీ కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కున్నారు. గులాం హైదర్ ప్రోత్సహంతో ‘మజ్బూర్’ సినిమాలో దిల్ మేరా తోడా పాటపాడారు లతా. ఈ పాట విన్న వారంతా లతాను విమర్శించారు.
ఆ విమర్శలను చాలెంజ్ గా తీసుకున్న లతాజీ ఉర్దులో సంగీత శిక్షణ తీసుకున్నారు. కొంత కాలం తరువాత దిలీప్ కుమార్, హేమమాలిని నటించిన మధుమతి సినిమాలోని ఒక పాటను పాడారు. ఆ పాటకు మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు లతామంగేష్కర్. దాంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.సినీ నేపథ్య గానంలో శిఖరాగ్రాన చేరిన లతాజీకి ‘మహాల్’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఆయేగా ఆయేగా.. పాటతో లతాజీ దశ తిరిగింది. ‘మహాల్’ సినిమా హిట్ కావడంతో లతాజీకి వెనుదిరిగి చూసుకోలేదు.
‘సంతానం’ సినిమా కోసం ఆమెతో పాడించిన పాట తెలుగు ప్రేక్షకులను హాయిగా నిద్రపుచ్చింది. అంతేకాకుండా ‘ఆఖరి పోరాటం’ సినిమాలో తెల్లచీరకు అనేసాంగుని కూడా పాడింది లతామంగేష్కర్. ఈ పాటలు విన్నతరువాత ఆమె బాలీవుడ్ సింగర్ అంటే ఎవ్వరు కూడా నమ్మరు కూడా.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.