• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SINGER GEETHA MADHURI SUPPORTS RAHUL SIPLIGUNJ SRIMUKHI FOR BIGG BOSS 3 TITLE BS

Bigg Boss 3 : నా సపోర్ట్ వారిద్దరికే.. గీతా మాధురి ఆసక్తికర పోస్ట్..

Bigg Boss 3 : నా సపోర్ట్ వారిద్దరికే.. గీతా మాధురి ఆసక్తికర పోస్ట్..

(Image : singergeethamadhuri/instagram)

బిగ్‌బాస్ 3 కార్యక్రమం తుది దశకు చేరుకుంది. గత వారం తీన్మార్ సావిత్రి శివజ్యోతి ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం ఐదుగురు టైటిల్ రేసులో నిలిచారు. అందులో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్ బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకునేందుకు పోటీ పడుతున్నారు.

  • Share this:
    బిగ్‌బాస్ 3 కార్యక్రమం తుది దశకు చేరుకుంది. గత వారం తీన్మార్ సావిత్రి శివజ్యోతి ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం ఐదుగురు టైటిల్ రేసులో నిలిచారు. అందులో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్ బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ ఐదుగురిలో ఎవరికి వారు ప్రత్యేకం. ప్రధానంగా రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి పోటీ పడుతున్నారు. టాస్క్‌లలో వీరి పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్‌లో ఉంటోంది. బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్ కూడా సామర్థ్యానికి తగ్గట్లు రాణిస్తున్నారు. అయితే.. ఎవరిది టైటిల్ అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అందులో చాలా మంది రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి వైపు మొగ్గు చూపుతున్నారు. వారికి సపోర్ట్ చేయాలంటూ కామెంట్లు, పోస్టులు, ఫోటోలు, వీడియోలతో హోరెత్తిస్తున్నారు. వరుణ్ సందేశ్ కూడా రేసులో ఉన్నాడని, అయితే.. మంచి అబ్బాయి కంటే కూడా రాహుల్, శ్రీముఖి ఆటతీరు ప్రత్యేకంగా ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

    అయితే, గత ఏడాది జరిగిన బిగ్‌బాస్ 2 లో రన్నరప్‌గా నిలిచిన గీతామాధురి ఇద్దరికి తన మద్దతు తెలిపినట్లు నెట్టింట్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇద్దరు కంటెస్టెంట్లతో ఫోటోలను పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. హౌజ్‌లో ఉన్న అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన గీతామాధురి.. ఇద్దరు ఫోటోలను మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వారిలో ఒకరు రాహుల్ సిప్లిగంజ్ కాగా, మరొకరు శ్రీముఖి. వీరిద్దరితో దిగిన ఫోటోలను గీతామాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో.. గీతామాధురి మద్దతు వీరిద్దరికేనని, వీరిలో ఎవ్వరు గెలిచినా ఆమెకు ఓకే అని రుజువు అయ్యిందని నెటిజన్లు చెబుతున్నారు. చూడాలి మరి ఎవరు విజేతగా నిలుస్తారో...!



     




    View this post on Instagram




     

    All the best to my friends @sreemukhi @sipligunjrahul @itsvarunsandesh @baba_bhasker @i.ali.reza Show choosi meeku nachina vaallaki vote cheyandi


    A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) on




    First published:

    అగ్ర కథనాలు