పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సింగర్ గీతా మాధురి...

Geetha Madhuri : గీతా మాధురి... తన మాస్ పాట‌ల‌తో కుర్రకారుని ఉర్రూతలూగించిన గాయని.. అంతేకాదు త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది.

news18-telugu
Updated: August 17, 2019, 8:46 PM IST
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సింగర్ గీతా మాధురి...
Photo : Instagram.com/singergeethamadhuri
  • Share this:
Geetha Madhuri : గీతా మాధురి... తన మాస్ పాట‌ల‌తో కుర్రకారుని ఉర్రూతలూగించిన గాయని.. అంతేకాకుండా తనదైన శైలిలో పాటలు పాడుతూ.. తెలుగు చిత్ర సీమలో  ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది. గీతా.. రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 2లో పాల్గొని తన చాకచక్యంతో అందరి మన్నలను పొంది.. షో రన్నరప్ కూడా నిలిచింది. గీతా మాధురి తన పాట‌ల‌తోనే కాకుండా అందంతో కూడా ఆక‌ట్టుకుంటున్న గాయని. అది అలా ఉంటే ఫిబ్ర‌వ‌రి 9, 2014న తాను ప్రేమించిన నటుడు నందును పెళ్లి చేసుకుంది. నందు కూడా మంచి న‌టుడిగా ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

View this post on Instagram
 

Blessed with a BlockBuster Baby Girl on 9th of August 2019- Both my Girls are being absolute Gangsters, Chilling & doing great..Thanks to our friends like followers for all your good wishes and blessings 🤗


A post shared by Actor Nandu (@that_actor_nandu) on

గీతా గ‌ర్భిణి అని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 9న గీతా పండంటి ఆడబిడ్డకు జన్మించింది. ఇదే విషయాన్ని ఆమె భర్త నందు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తల్లీ, బిడ్డ.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని.. అందరికీ ధన్యవాదాలు అంటూ నందు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>