Home /News /movies /

SINGER CHITRA REVEALS INTERESTING FACTS ABOUT SP BALASUBRAMANYAM IN ALITHO SARADAGA SHOW NR

Alitho Saradaga: ఎస్పీ బాలసుబ్రమణ్యం గారితో ''అ, ఆ''లు నేర్పించుకున్న సింగర్ ఎవరో తెలుసా?

Sp Balasubramanyam

Sp Balasubramanyam

Alitho Saradaga: ఎన్నో భాషలలో ఎన్నో వేల పాటలు పాడి ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న సింగర్ కె. ఎస్. చిత్ర గురించి అందరికీ తెలిసిందే. తన పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకొని 'దక్షిణ భారత నైటింగేల్' అనే బిరుదు సొంతం చేసుకుంది.

  Alitho Saradaga: ఎన్నో భాషలలో ఎన్నో వేల పాటలు పాడి ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న సింగర్ కె. ఎస్. చిత్ర గురించి అందరికీ తెలిసిందే. తన పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకొని 'దక్షిణ భారత నైటింగేల్' అనే బిరుదు సొంతం చేసుకుంది. తన పాటలకు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇక ఈమెను పలు రాష్ట్రాలలో కొన్ని పేర్లతో ముద్దుగా పిలుచుకుంటారు. ఇదిలా ఉంటే తను పాడిన పాటలకు తన తల్లి చాలా కోపం అయ్యిందట.

  1979లో మలయాళ సినిమాలో మొదటిసారిగా తన పాటను వినిపించింది చిత్ర. ఆ తర్వాత తెలుగు, హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ ఒరియా ఇలా చాలా భాషలలో ఇరవై వేలకు పైగా పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఓ బుల్లితెర షో లో పాల్గొని తన గురించి తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ షోలో ఎంతోమంది సెలబ్రెటీలను ఆహ్వానించి తమ వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటాడు ఆలీ.

  chitra

  ఇదిలా ఉంటే తాజాగా వచ్చేవారం ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో సింగర్ చిత్ర గెస్ట్ గా పాల్గొన్నారు. ఇక ఎంట్రీ తోనే తనకు పూల వర్షాన్ని కురిపించారు. ఇక ఇన్ని పాటలు పాడిన చిత్ర గారిని మీ షో కు ఎందుకు పిలవటం లేదు అని వార్నింగులు ఇస్తున్నారని అనడంతో చిత్ర నవ్వుతో స్పందించింది. చిత్రా టెన్షన్ గా అనిపించడంతో ఆలీ తనను టెన్షన్ పడవద్దని ధైర్యం ఇచ్చాడు. వెంటనే చిత్ర.. మీరు ఎలా మాట్లాడుతారో అందుకు టెన్షన్ అని అనడంతో నేను నాలాగే మాట్లాడతాను అని నవ్విస్తాడు ఆలీ.


  అలా తన మాటలతో బాగా సందడి చేయగా చిత్రతో కొన్ని పాటలు కూడా పాడించాడు. అంతేకాకుండా కొన్ని పంచ్ లతో కూడా బాగా నవ్వించాడు ఆలీ. ఇక ఒకరోజులో ఎన్ని పాటలు పాడారు అని ఆలీ ప్రశ్నించడంతో.. ఒక్కరోజు 16 పాటలు పాడానని తెలిపింది చిత్ర. అలా ఆ రోజు పాటలు పాడి తన ఇంటికి వెళ్ళాక తన తల్లి తన మీద చాలా కోపం అయ్యారట. ఎందుకంటే తను ఒక్క రోజు అన్ని పాటలు పాడటంతో ఆరోగ్యం ఏమవుతుందని, శరీరం మొత్తం నీరసిస్తుందని అలా ఎప్పుడు చేయద్దు అని కోపం అయ్యిందట. అంతే కాకుండా తన తండ్రి గురించి కూడా చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యింది చిత్ర.
  Published by:Navya Reddy
  First published:

  Tags: Alitho Saradaga, Comedian ali, Singer chitra, Sp balasubramanya, Tollywood

  తదుపరి వార్తలు