అడ్డంగా బుక్కైయిన చిన్మయి.. భర్త చేసిన పనిని షేర్ చేసినందుకు నెటిజన్స్ ఫైర్..

తమిళ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలతో మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సింగర్ చిన్మయి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా చిన్మయి.. తన భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘మన్మథుడు 2’ లో తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించి టీజర్‌ను షేర్ చేసి అడ్డంగా బుక్ అయింది.

news18-telugu
Updated: July 10, 2019, 8:30 PM IST
అడ్డంగా బుక్కైయిన చిన్మయి.. భర్త చేసిన పనిని షేర్ చేసినందుకు నెటిజన్స్ ఫైర్..
చిన్మయి శ్రీపాద Photo : Instagram.com/chinmayisripaada/
  • Share this:
తమిళ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలతో మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సింగర్ చిన్మయి మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఎప్పూడు యాక్టివ్‌గా వుండే ఈ సింగర్ తనదైన స్టైల్‌లో మెసేజ్‌లు ఇస్తూనే ఉంటారు.తాజాగా చిన్మయి.. తన భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘మన్మథుడు 2’ లో తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించి టీజర్‌ను షేర్ చేసి అడ్డంగా బుక్ అయింది. ఈ టీజర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ సిగరెట్ తాగే సీన్ ఉంది. రీసెంట్‌గా చిన్మయి.. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ‘కబీర్ సింగ్’లోని హీరోయిన్‌ను చూపించన విధానాన్ని ఉద్దేశిస్తూ అమ్మాయిలను అలా చూపించవచ్చా ? అంటూ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలసిందే కదా. ఇక అపుడు చిన్మయి సందీప్ రెడ్డిని చేసిన కామెంట్స్ ‌ను ఇపుడు రాహుల్ రవీంద్రన్ తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌ను చూపించిన విధానాన్ని పోల్చూతూ నెటిజన్స్ ఇపుడు చిన్మయిని ట్రోల్ చేస్తున్నారు. మీ భర్త హీరోయిన్‌ను అలా చూపిస్తే తప్పులేదు కానీ.. వేరొకరు చేస్తే తప్పా ? అని చిన్మయి తీరును ప్రశ్నిస్తున్నారు. మరి నెటిజన్స్ కామెంట్స్‌కు చిన్మయి ఎలా సమాధానమిస్తుందో చూడాలి.

 
First published: July 10, 2019, 8:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading