హోమ్ /వార్తలు /సినిమా /

చిన్మయి మళ్లీ ఫైర్.. అమ్మాయిలను అక్కడ చూస్తే అమ్మ పాలు తాగనట్లే..

చిన్మయి మళ్లీ ఫైర్.. అమ్మాయిలను అక్కడ చూస్తే అమ్మ పాలు తాగనట్లే..

చిన్మయి శ్రీపాద Photo : Instagram.com/chinmayisripaada/

చిన్మయి శ్రీపాద Photo : Instagram.com/chinmayisripaada/

చిన్మయి శ్రీపాద అంటే కేవలం పాటలే కాదు.. కాంట్రవర్సీలు కూడా గుర్తుకొస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఈమె సంచలన కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళా హక్కులంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ..

చిన్మయి శ్రీపాద అంటే కేవలం పాటలే కాదు.. కాంట్రవర్సీలు కూడా గుర్తుకొస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఈమె సంచలన కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళా హక్కులంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది చిన్మయి. ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటి కామెంట్స్ చేసింది ఈ సింగర్. ఈ మధ్యే ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ఓ యువతి ఇంటికి వచ్చి ఆమెను చున్నీ సర్దుకోమని సలహా ఇచ్చాడు.. తనకు జరిగిన అనుభవం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సదరు యువతి.

Singer Chinmayi Sripada sensational comments on men and backs women who raised on swiggy boy pk చిన్మయి శ్రీపాద అంటే కేవలం పాటలే కాదు.. కాంట్రవర్సీలు కూడా గుర్తుకొస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఈమె సంచలన కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళా హక్కులంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ.. chinmayi sripaada,chinmayi sripaada twitter,chinmayi sripaada instagram,chinmayi sripaada swiggy,chinmayi sripaada breast,chinmayi sripaada movies,chinmayi sripaada songs,chinmayi sripaada controversy,chinmayi sripaada casting couch,chinmayi sripaada men,telugu cinema,చిన్మయి శ్రీపాద,చిన్మయి శ్రీపాద కామెంట్స్,చిన్మయి శ్రీపాద పాటలు,తెలుగు సినిమా
సింగర్ చిన్మయి శ్రీపాద Photo: Instagram/chinmayisripaada

స్విగ్గీ.. మీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటే చాలు.. మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఆ యువతి ఘాటుగానే స్పందించింది. మీ డెలివరీ ఏజెంట్ బాయ్ పార్సిల్ ఇవ్వడానికి వచ్చి.. వచ్చిన పని చూసుకోకుండా మేడమ్ మీ చున్నీ కప్పుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాడు.. నా ఇంట్లో నా యిష్టమొచ్చినట్లు ఉంటాను.. మీరెవరు చెప్పడానికి.. అయినా ఇతరులతో ఎలా నడుచుకోవాలో కూడా మేమే నేర్పించాలా అంటూ ఆమె మండిపడింది. దాంతో ఈమె చేసిన ట్వీట్ కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

దీనికి ఇప్పుడు చిన్మయి కూడా సపోర్ట్ చేస్తుంది. మహిళల వక్షోజాలను చూసే మగాళ్లను చూస్తుంటే.. చిన్నపుడు వాళ్ల అమ్మ రొమ్ము పాలు తాగలేదేమో అనిపిస్తుంది నాకు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఓ మహిళ చున్నీతో తన ఒళ్లు కప్పుకోకపోతే వాటి వల్లే రేప్స్ జరుగుతాయనుకునే నీచమైన సమాజంలో మనమున్నామా అంటూ ప్రశ్నిస్తుంది చిన్మయి.. ఈ విషయంలో మరికొందరు ఆ సదరు డెలవరీ ఏజెంట్ బాయ్‌ను కూడా సమర్థిస్తున్నారు. అందులో తప్పేముంది.. ఆమె మంచికోసమే కదా చెప్పాడంటున్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు చిన్మయి మరోసారి ఈ ఘటనతో వార్తల్లోకి వచ్చేసింది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Chinmayi Sripada, Swiggy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు