news18-telugu
Updated: January 30, 2020, 3:06 PM IST
చిన్మయి శ్రీపాద Photo : Instagram.com/chinmayisripaada/
తమిళ సినీ గాయిని చిన్మయి ‘మీ టూ’ ఉద్యమంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తమిళ సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆమె నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు రాధారవితో ఆమె తలపడుతున్నారు. డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు ఫిబ్రవరి 15న జరగనున్నాయి. డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవి తిరిగి ఆదే పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనపై పోటీ అభ్యర్థిగా చిన్మయి బరిలో నిలుస్తున్నారు.
డబ్బింగ్ యూనియన్ కార్యాలయంలో చిన్మయి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిన్మయి డబ్బింగ్ కార్యాలయంలోకి రాకుండా రాధారవి మద్దతుదారులు అడ్డుకున్నారు. తన సభ్యత్వాన్ని చిన్మయి రిన్యూవల్ చేసుకోకపోవడంతో ఆమె సభ్యత్వాన్ని కోల్పోయారని రాధారవి మద్దతుదారులు చెబుతున్నారు. యూనియన్లో సభ్యులుకాని వారు ఎలా నామినేషన్ దాఖలు చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దిచెప్పడంతో చిన్మయి యూనియన్ కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్లో సభ్యత్వాన్ని కోల్పోయినందున, ఆమె నామినేషన్ను తిరస్కరించాలని రాధారవి మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తనను డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం నుంచి తొలగించారని చిన్మయి ఆరోపిస్తోంది.తాను యూనియన్లో జీవితకాల సభ్యురాలినని ఆమె చెప్పుకొచ్చారు.
Published by:
Janardhan V
First published:
January 30, 2020, 3:03 PM IST