చిన్మయి మరో సంచలనం.. వైరముత్తు కనిపిస్తే కచ్చితంగా కొడతా..

చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత దేహం అయితే.. ఈమె స్వరం.. అలా చిన్మయి అందరికీ పరిచయమే. దాంతో పాటు క్యాస్టింగ్ కౌచ్‌తో కూడా పరిచయమే. ఇండస్ట్రీలో ఇంకా క్యాస్టింగ్ కౌచ్ మంటలు రేగుతూనే ఉన్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 3:08 PM IST
చిన్మయి మరో సంచలనం.. వైరముత్తు కనిపిస్తే కచ్చితంగా కొడతా..
సినీ గాయకి చిన్మయి
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 3:08 PM IST
ఇండస్ట్రీలో ఇంకా క్యాస్టింగ్ కౌచ్ మంటలు రేగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త రూపంలో ఇది బయటికి కనిపిస్తుంది. ఇక ఈ ఇష్యూపై ముందు నుంచి పోరాడుతుంది సింగర్ చిన్మయి. అప్పట్లో ఓ స్కామ్‌లో ఇరుక్కుని న్యూడ్ వీడియోలు కూడా బయటికి రావడంతో చాలా ఇబ్బంది పడింది చిన్మయి. ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు కూడా తాను ఎదుర్కొన్నానని చెప్పి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా లెజెండరీ లిరిక్ రైటర్ వైరముత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది ఈ గాయని. ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని మరోసారి చెప్పింది.

Singer Chinmayi once again targeted lyricist Vairamuthu and She wants to slap him like Kushboo did pk.. చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత దేహం అయితే.. ఈమె స్వరం.. అలా చిన్మయి అందరికీ పరిచయమే. దాంతో పాటు క్యాస్టింగ్ కౌచ్‌తో కూడా పరిచయమే. ఇండస్ట్రీలో ఇంకా క్యాస్టింగ్ కౌచ్ మంటలు రేగుతూనే ఉన్నాయి. chinmayi,chinmayi casting couch,chinmayi sexual harassment,chinmayi vairamuthu,chinmayi vairamuthu slapping,chinmayi vairamuthu slaps,kushboo slaps,tamil cinema,vairamuthu casting couch,చిన్మయి,చిన్మయి క్యాస్టింగ్ కౌచ్,చిన్మయి ఖుష్బూ,చిన్మయి వైరముత్తు,వైరముత్తు చెంప పగలగొడతానంటున్న చిన్మయి,
తమిళ రచయిత వైరముత్తు

ఈ సారి కానీ తనకు వైరముత్తు కనిపిస్తే కచ్చితంగా అతడి చెంప చెళ్లుమనిపిస్తానని వార్నింగ్ ఇచ్చింది చిన్మయి. గతంలో ఈయన తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది చిన్మయి. అసలు ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే.. ఈ మధ్యే ఎన్నికల ప్రచారంలో ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తున్న సీనియర్ నటి ఖుష్బూని ఆ గుంపులో ఉన్న ఓ వ్యక్తి అసభ్యంగా తాకాడు. దాంతో వెంటనే ఆమె చెంప పగలగొట్టింది. ఆ వీడియో వైరల్ అయిపోయింది కూడా.. దాన్ని ట్యాగ్ చేస్తూ మహిళలతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తికి ఖుష్బూ మేడం సరిగ్గా బుద్ధి చెప్పిందని తెలిపాడు వైరముత్తు.

Singer Chinmayi once again targeted lyricist Vairamuthu and She wants to slap him like Kushboo did pk.. చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత దేహం అయితే.. ఈమె స్వరం.. అలా చిన్మయి అందరికీ పరిచయమే. దాంతో పాటు క్యాస్టింగ్ కౌచ్‌తో కూడా పరిచయమే. ఇండస్ట్రీలో ఇంకా క్యాస్టింగ్ కౌచ్ మంటలు రేగుతూనే ఉన్నాయి. chinmayi,chinmayi casting couch,chinmayi sexual harassment,chinmayi vairamuthu,chinmayi vairamuthu slapping,chinmayi vairamuthu slaps,kushboo slaps,tamil cinema,vairamuthu casting couch,చిన్మయి,చిన్మయి క్యాస్టింగ్ కౌచ్,చిన్మయి ఖుష్బూ,చిన్మయి వైరముత్తు,వైరముత్తు చెంప పగలగొడతానంటున్న చిన్మయి,
సింగర్ చిన్మయి Photo : Instagram/chinmayisripaada
దీన్ని చూసిన చిన్మయి పై విధంగా స్పందించింది. పదేళ్ల క్రితం తనను కూడా వేధించిన వైరముత్తు ఇప్పుడు కనిపిస్తే చెంప పగలగొట్టాలనుకుంటున్నట్లు చెప్పింది చిన్మయి. అప్పట్లో ఓ కార్యక్రమం కోసం విదేశానికి వెళితే అక్కడ మరో వ్యక్తితో తనను గదిలోకి రమ్మని రాయబారం పంపించారని చెప్పింది చిన్మయి. ఈ వ్యాఖ్యల్ని వైరముత్తు తప్పు బట్టినా.. ఆయన తమతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు మరికొందరు. అయితే పబ్లిసిటీ కోసమే చిన్మయి ఇవన్నీ చేస్తుందని కొందరు విమర్శిస్తున్నారు కూడా.
First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...