Chinmayi Sripada: హైదరాబాద్ హాస్టల్ వార్డెన్ పైశాచికం...గుట్టు విప్పిన చిన్మ‌యి

Singer Chinmayi Sripada: సింగర్ చిన్మయి లైంగిక వేధింపులకు గురైన మరో అమ్మాయి గురించిన విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు హైదరాబాద్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.

news18-telugu
Updated: December 1, 2020, 6:44 PM IST
Chinmayi Sripada: హైదరాబాద్ హాస్టల్ వార్డెన్ పైశాచికం...గుట్టు విప్పిన చిన్మ‌యి
సింగర్ చిన్మయి
  • Share this:
ప‌లు రంగాల్లో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా మొద‌లైన ఉద్య‌మం ‘మీ టూ’. హాలీవుడ్‌లో మొద‌లైన ఈ ఉద్య‌మం క్ర‌మంగా బాలీవుడ్ కి...అటు నుండి సౌత్ సినీ ఇండ‌స్ట్రీకి కూడా పాకింది. ద‌క్షిణాదిన ఈ ఉద్య‌మాన్ని చురుకుగా ముందుకు తీసుకెళ్లిన వ్య‌క్తి సింగ‌ర్ చిన్మ‌యి. ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత వైర‌ముత్తు, సీనియ‌ర్ ఆర్టిస్ట్ రాధా రవి, సింగ‌ర్ కార్తీక్‌, మ‌నోల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌ను చేసిన చిన్మ‌యి.. ఒక‌ప్పుడు టాక్ ఆఫ్ ఆది ఇండ‌స్ట్రీగా మారింది. దీని వల్ల చిన్మయికి వృత్తిపరమైన సమస్యలు కూడా వచ్చాయి. సింగర్‌గా అవకాశాలు పెద్దగా రాలేదు. అదీ కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుండి ఆమెను ఏవో కారణాలు చూపి పక్కకు పెట్టేశారు. కానీ చిన్మయి మీ టూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. చిన్మయి క్షమాపణలు చెబితే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌లో చేర్చుకుంటామని కూడా రాధారవి ఆఫర్ ఇచ్చినా చిన్మయి నిరభ్యంతరంగా తోసిపుచ్చేసింది. కాగా.. అమ్మాయిలు చాలా మంది తమకు ఎదురైన లైంగిక వేధింపులను చిన్మయికి చెబితే వాటిని చిన్మయి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తుంది. హైదరాబాద్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కూడా గుర్తు చేసుకుంది.

లేటెస్ట్‌గా హాస్టల్‌లో ఓ అమ్మాయి తనకు ఎదురైన ఇబ్బందికరమైన పరిస్థితిని చిన్మయికి ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీన్ని చిన్మయి అందరికీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ‘‘2015లో పదవ తరగతి చదివేదాన్ని. ఓ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. అక్కడ హాస్టల్ వార్డెన్ మమ్మల్ని (అంటే అమ్మాయిలను) చాలా ఇబ్బంది పెట్టేది. ఎవరైనా పీరియడ్స్‌తో బాధపడుతున్నామని చెప్పినా వినిపించుకునేది కాదు. వారి బట్టలు విప్పి చూపిస్తే కానీ.. నమ్మేది కాదు. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నాకు కూడా ఎదురైంది. ఓసారి క్లాసులో ఉండగా  నాకు పీరియడ్స్ అయ్యాయి. నేను క్లాసులో ఉండలేక హాస్టల్‌కు వచ్చాను. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా వార్డెన్ నన్ను హాస్టల్‌లోనికి పంపలేదు. బట్టలు విప్పి చూపించమంది. ఇక చేసేది లేక నేను బట్టలు విప్పి చూపిస్తే.. అప్పుడు నమ్మింది. నన్ను హాస్టల్‌ లోపలికి పంపంది’’ అని అమ్మాయి బాధను వ్యక్తం చేసింది చిన్మయి. ఈ ఘటన జరిగింది హైదరాబాద్‌లో. ఇలాంటి ఘటనే గుజరాత్‌లోనూ జరిగింది. ఈ రెండు విషయాలను చెబుతూ చిన్మయి అసలు విషయాన్ని వివరించడమే కాకుండా.. సదరు వార్డెన్‌ను సూక్ష్మజీవి అంటూ తిట్టింది చిన్మయి.
అటు చిన్మయి చేసిన ట్వీట్ సిగ్గు చేటు అంటూ కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు ధీటైన సమాధానం చెప్పిందామె. సక్రమమైన పెంపకంలో పెరగకుండా ఇలాంటి అభిప్రాయాలతోనే ఉంటారంటూ తిట్టిపోసింది. మహిళలు ఎదుర్కొనే పీరియడ్స్ సమస్యలను తాను ప్రస్తావించడాన్ని సమర్థించుకుంది.

singer chinmayi, chinmayi sripada news, mee too movement, chinmayi meetoo. radharavi, vaira mutthu, south industry,warden, ladies hostel. hostel warden hyderabad, gems in society, physical harash, girl in hyderabad
చిన్మయి


కాగా సింగర్ చిన్మయి .. హీరోయిన్ సమంతకు మంచి స్నేహితురాలు. హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను ఈమె వివాహం చేసుకుంది.
Published by: Anil
First published: December 1, 2020, 6:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading