news18-telugu
Updated: January 13, 2021, 7:22 PM IST
Singer and Bigg Boss 4 contestant noel sen ex wife re entry into movies
ర్యాప్ సింగర్ నోయల్, హీరోయిన్ ఎస్తర్ కొన్నాళ్లు క్రితం పెళ్లి చేసుకున్నారు. ఏడాది కాపురం తర్వాత ఇద్దరూ విడాకులు కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు ఎవరు లైఫ్‌ను వాళ్లు లీడ్ చేస్తూ వస్తున్నారు. నోయల్ బిగ్‌బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా నోయల్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడిపోయాడనుకోండి. ఇక ఎస్తర్ విషయానికి వస్తే విడాకుల విషయం బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉండిపోయిన ఎస్తర్.. ఇప్పుడు మళ్లీ వెండితెరపై రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. హీరోయిన్ అనే సినిమాలో ఎస్తర్ టైటిల్ పాత్రలో నటిస్తుంది. ఆసక్తికరమైన విషయమేంటంటే.. సినిమా రంగంలోని మంచి చెడులను ఆవిష్కరించేలా హీరోయిన్ అనే సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఎస్తర్ పోర్న్ స్టార్‌గా నటించనుందట. కథాంశానికి అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో ఎస్తర్ బోల్డ్‌గా కూడా నటిస్తుందని దర్శకుడు తిరుపతి తెలిపారు. అది కూడా పోర్న్ స్టార్ రోల్ అయిపాయె.. మరి ఎస్తర్ ఎంత బోల్డ్‌గా నటిస్తుందే తెలియాలంటే వెయిటింగ్ తప్పేలా లేదు.
అయ్యిందేదో అయ్యింది.. ఇక ఎవరి లైఫ్ వారిది కాబట్టి ఎస్తర్.. ముందడుగు వేసి సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంది. అయితే బోల్డ్ సినిమాల్లో నటించడం ద్వారా ఎస్తర్ ఎలాంటి సంకేతాలను పంపుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బోల్డ్‌గా, బోల్డ్ కంటెంట్‌లో నటించడం తప్పు లేదు కానీ.. ఆ పాత్ర ఎస్తర్‌కు పేరు తెచ్చిపెట్టేదైతే మంచి పరిణామనే చెప్పొచ్చు. తెలుగులో ఎస్తర్ వెయ్యి అబద్దాలు, భీమవరం బుల్లోడు, జయజానకి నాయక, నయనం, జులియట్ లవర్ ఆఫ్ ఇడియట్ వంటి పలు చిత్రాల్లో నటించింది.

Singer and Bigg Boss 4 contestant noel sen ex wife re entry into movies
నోయల్ ఎస్తర్ ఒకరికొకరు మ్యూచువల్ అండర్ స్టాండింగ్‌తో విడాకులు తీసుకున్నారు. విడాకులు వచ్చిన తర్వాత ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ తాము విడిపోయామంటూ అధికారికంగా ప్రకటించారు. బిగ్‌బాస్ 4లో నోయల్ మంచి ఓటింగ్‌తోనే రాణిస్తూ వచ్చినప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలతో హౌస్ నుండి తప్పక బయటకు వచ్చేశారు.
Published by:
Anil
First published:
January 13, 2021, 7:22 PM IST