Singeetam Srinivasa Rao : సింగీతం శ్రీ‌నివాస‌రావుకు కరోనా పాజిటీవ్..

Singeetam Srinivasa Rao : ప్రముఖ సినీ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు క‌రోనా బారీన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని సింగీతం స్వ‌యంగా వెల్ల‌డించారు.

news18-telugu
Updated: September 16, 2020, 3:20 PM IST
Singeetam Srinivasa Rao : సింగీతం శ్రీ‌నివాస‌రావుకు కరోనా పాజిటీవ్..
సింగీతం శ్రీ‌నివాస‌రావు Photo : Twitter
  • Share this:
ప్రముఖ సినీ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు క‌రోనా బారీన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని సింగీతం స్వ‌యంగా వెల్ల‌డించారు. లక్షణాలు కొద్దిగా ఉండడంతో ఇటీవ‌ల క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, త‌న‌కి పాజిటీవ్ అని తేలింద‌ని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”నేను ఇప్పుడేంటి.. గ‌త అర‌వై, డ‌భై ఏళ్లుగా పాజిటీవ్‌నే…` అంటూ.. క‌రోనాని సైతం లైట్ తీసుకున్నారు దర్శకుడు. పరీక్షల్లో పాజిటీవ్ అని తేలడంతో ఆయన ప్రస్తుతం హోం ఐసొలేష‌న్‌లో ఉన్నాన‌ని పేర్కోన్నాడు. ఈ హోమ్ ఐసోలేషన్ ఈనెల 23 వ‌ర‌కూ ఉండనుందని చెప్పారు. ఈ సందర్భంగా తన అభిమానులు, స‌న్నిహితులు, స్నేహితులు కంగారు ప‌డొద్ద‌ంటూ.. త‌న ఆరోగ్యం పూర్తిగా అదుపులోనే ఉంద‌ని, త్వ‌ర‌లోనే పూర్తిగా కోలుకుంటానని అన్నారు.


ఇక సింగీతం సినిమాల విషయానికి వస్తే ఆదిత్య 369 సినిమాతో కృష్ణదేవరాయల వైభవాన్ని కళ్లకు కట్టిన సినీ మాంత్రికుడు. భైరవ ద్వీపం సినిమాతో కంప్యూటర్ యుగంలో జాపపదాన్ని సినిమాగా తీసి మెప్పించిన ఘనుడు. కథ ఏదైనా జానర్ ఇంకెదైనా ఆయన చేతిలో పడితే అందమైన కావ్యంగా మారిపోవాల్సిందే. సినీరంగంలో అన్ని కోణాలను టచ్ చేసిన సృజనశీలి సింగీతం. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసిన ప్రయోగాలు విజయవంతం కావడమే కాదు. ఎన్నో అవార్డులు, రివార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. కమల్ హాసన్‌లోని వైవిధ్య నటనా కౌశలాన్ని సింగీతం చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. ‘సొమ్మొకడిది సోకొకడిది’ సినిమాతో ప్రారంభమైన వీరి కాంబినేషన్ ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. ‘అమావాస్య చంద్రుడు’, ‘విచిత్ర సోదరులు’ ఈ అద్భుతాలకో మచ్చుతునకలు. ‘మయూరి’ సినిమాతో సింగీతం శ్రీనివాసరావు పేరు మారుమోగిపోయింది. ప్రముఖ నృత్య కళాకారిణి సుధాచంద్రన్ నిజజీవిత కథ ఆధారంగా నిర్మించిన ఈ సినిమా దర్శకుడిగా ఆయన ఖ్యాతిని నలుదిక్కులా వ్యాపింపచేసింది. ప్ర‌స్తుతం సింగీతం ఓ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. దానికి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించనుందని సమాచారం.
Published by: Suresh Rachamalla
First published: September 16, 2020, 1:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading