Home /News /movies /

SINGARENI MUDDU BIDDA SOHEL ALL SET FOR SILVER SCREEN DEBUT WILL HE MEET EXPECTATIONS OF CHIRANJEEVI MHN

Bigg Boss 4 Sohail - Chiranjeevi: సినిమాల్లో బోణీ కొడుతున్న సింగరేణి బిడ్డ సోహైల్.. చిరంజీవి మాట నిల‌బెట్టుకుంటాడా?

Singareni Muddu Bidda Sohel All Set For Silver Screen Debut

Singareni Muddu Bidda Sohel All Set For Silver Screen Debut

Bigg Boss 4 Sohail - Chiranjeevi: సింగరేణి బిడ్డ సోహైల్ త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

    తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4 సీజ‌న్ ముగిసింది. అంద‌రూ ఊహించిన‌ట్లే అభిజీత్ విన్న‌ర్‌గా గెలిచాడు. అఖిల్ ర‌న్న‌ర్‌గా నిలిచాడు. అయితే మూడో స్థానంలోనిలిచిన సోహైల్ మాత్రం అంద‌రి దృష్టిని త‌న వైపు తిప్పుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. సినిమాల్లో న‌టించాల‌నుకుంటున్నాన‌ని సోహైల్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న‌ప్పుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే బిగ్‌బాస్ ఫైన‌ల్ వ‌ర‌కు త‌న జ‌ర్నీ కంటిన్యూ అయ్యిందో త‌న‌తో సినిమాలు చేయ‌డానికి ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఆస‌క్తి చూపుతున్నారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే గురువారం అధికారిక ప్రకటనే వచ్చేసింది. జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్ వంటి సినిమాలను నిర్మించిన నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీనివాస్ వింజ‌నం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ట‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, ఫిబ్ర‌వ‌రి నుండి సినిమా సెట్స్ పై కి వెళుతుంద‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

    బిగ్‌బాస్ ఫైన‌ల్ త‌ర్వాత అభిజీత్ వ‌రుస అవ‌కాశాల‌తో బిజి బ‌జీ అయిపోతాడ‌ని అంద‌రూ అనుకున్నారు. అభిజీత్ సంగ‌తి ఏమో కానీ.. ముందుగా మాత్రం సింగ‌రేణి బిడ్డ సోహైల్ దూకుడు చూపించాడు. హీరోగా త‌న సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చేలా చ‌క చ‌కా పావులు క‌దిపాడు. బిగ్‌బాస్ వ‌ల్ల వ‌చ్చిన క్రేజ్‌ను సినిమా కెరీర్ ప‌రంగా ఉప‌యోగించుకోడానికి రెడీ అయిపోయాడు.

    ఇక సోహైల్‌కు బిగ్‌బాస్ ఫైన‌ల్‌లో అటు బ్ర‌హ్మానందం.. ఇటు మెగాస్టార్ చిరంజీవి అభ‌యం ఇచ్చాడు. ఒక‌వేళ తాను భ‌విష్య‌త్తులో సినిమా చేస్తే స‌పోర్ట్ ఇవ్వాలంటూ సోహైల్ రిక్వెస్ట్ చేస్తే.. చిరు ఏమాత్రం ఆలోచించ‌కుండా సోహైల్ సినిమా ప‌రంగా త‌న వంతు సాయం చేయ‌డానికి రెడీ అని చెప్పేశాడు. అంతే కాదండోయ్ ఏ మాత్రం వీలున్నా ప్ర‌త్యేక పాత్ర‌లో కూడా న‌టిస్తాన‌ని కూడా సోహైల్ తెలిపాడు. మ‌రి సోహైల్ కోరిక‌ను చిరు ఈ సినిమాకే తీరుస్తాడా? లేక మ‌రేదైనా సినిమాలో సోహైల్ కోసం అతిథి పాత్ర‌లో న‌టిస్తాడా అనేది తెలియాలంటే వెయిటింగ్ త‌ప్ప‌దు.
    Published by:Anil
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Megastar Chiranjeevi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు